తెలంగాణ

77 లక్షలు పలికిన వెంకన్న లడ్డూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 13: ధనుర్మాసంలో భాగంగా మెదక్ జిల్లా సంగారెడ్డి పట్టణ పరిధిలోని వైకుంఠపురం శ్రీ మహాలక్ష్మీ గోదా సమేత విరాట్ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రంలో బుధవారం నాడు స్వామి వారి కల్యాణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. మూడు రోజులుగా పట్టణంలో మార్మోగుతున్న స్వామి వారి నామస్మరణ కల్యాణం రోజున భక్తులు మరింతగా పులకించిపోయారు. నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన కల్యాణోత్సవ వేడుకలు పట్టణానికి శోభాయమానమవుతున్నాయి. ఇప్పటివరకు వినాయకుడి లడ్డూలను మాత్రమే ఎక్కువ వేలం పలికిన సందర్భాలు ఉండగా మొదటిసారిగా వైకుంఠపురం లడ్డూ వేలం చరిత్ర సృష్టించింది. మొదటి సారి నిర్వహించిన వేలంలో వెంకన్న లడ్డూను 77,777 పలికింది. గత యేడాది నిర్వహించిన వేలంలో ప్రస్తుత సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ 7,77,777 రూపాయలకు దక్కించుకున్నారు. వేలాది మంది భక్తుల సమక్షంలో బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభించిన వేలం పాట సుమారు గంట పాటు కొనసాగింది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ సతీమణి పద్మిని, గాయత్రి చిల్డ్రన్స్ ఆసుపత్రి డాక్టర్ కుమార్‌రాజ్, రాఘవేంద్రా టెక్స్ టైల్స్ యజమాని పురం వీరేందర్ పోటీ పడ్డారు. మందిరం ప్రధాన అర్చకులు వరదాచార్యులు ముందుగా 7,777 రూపాయలతో వేలం పాటను ప్రారంభించారు. 25 కిలోల బరువు ఉన్న ఈ లడ్డూను పద్మిని దక్కించుకోవడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మా రింది. ఉదయం ప్రత్యేక పూజలు ని ర్వహించిన అనంతరం మధ్యా హ్నం 12 గంటల నుంచి స్వామి వారి కల్యాణోత్సవ వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. సుమారు 600 జంట లు 501 రూపాయల టికెట్‌ను కొనుగోలు చేసి కల్యాణోత్సవ కార్యక్రమం లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. లడ్డూ ను దక్కించుకున్న పద్మిని మాట్లాడు తూ తాను ఎంతగానో విశ్వసించే స్వామివారి లడ్డూ దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని, గత యేడాది నిర్వహించిన వేలం పాటలో పాల్గొన్నటికీ తనకు స్వామి వారి ప్రసాదం లభించలేదని, ఈసారి ఎంత పలికినా తాను స్వంతం చేసుకోవాలనే పట్టుదలతో వేలం పాల్గొన్నట్లు ఆమె తెలిపారు. వైకుంఠపురం మరో తిరుమల దేవస్థానంగా అభివృద్ధి చెంది భక్తుల కోర్కెలు తీర్చాలని ఆమె ఆకాంక్షించారు. లడ్డూకు చెల్లించాల్సిన 77,77, 777 డబ్బును జై శ్రీమన్నారాయణ ట్రస్టు పేరున బ్యాంకులో పిక్స్‌డ్ డిపాజిట్ చేయనున్నట్లు వివరించారు.

వెంకటన్న కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
వేలంలో లడ్డూను దక్కించుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి భార్య పద్మిని