రాష్ట్రీయం

త్వరలో మూడో ఏరోస్పేస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: రక్షణ, విమానయాన రంగాల హబ్‌గా హైదరాబాద్ త్వరలోనే సాక్షాత్కరించనుందని రాష్ట్ర సాంకేతిక సమాచార, పరిశ్రమల మంత్రి కె తారకరామారావు పునరుద్ఘాటించారు. విమానయానం, అంతరిక్షం, రక్షణ రంగాలకు ఇప్పటికే హైదరాబాద్ గమ్యస్థానమైందన్నారు. ఆదిభట్ల సెజ్‌లో న్యూకాన్ ఏరోస్పేస్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. విమానయానం, అంతరిక్షం, రక్షణ రంగాలకు సంబంధించి ఉత్పత్తి, అమరిక, ఏవియేషన్ స్పేస్, రక్షణరంగ ఉత్పత్తుల పరీక్షల సదుపాయాలను ఈ సంస్థ అందించనుంది. న్యూకాన్ ఏరోస్పేస్ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌ను రక్షణ, వైమానిక రంగాల హబ్‌గా మార్చేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ఆదిభట్ల, శంషాబాద్‌లలో రెండు ఏరోస్పేస్ పార్క్‌లను అభివృద్ధి చేశామన్నారు. మూడో ఏరో స్పేస్ పార్క్ త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే, హైదరాబాద్‌లో రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను త్వరలో నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్‌లో వైమానిక విశ్వవిద్యాలయం ఏర్పాటుకు లండన్‌కు చెందిన ట్రాన్ ఫీల్డ్ వర్శిటీతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. తెలంగాణ కొత్త పారిశ్రామిక విధానంలో 15 రోజుల్లోనే కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే యోచనతో పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నట్టు చెప్పారు. పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అనువైన ప్రదేశమని, అనుమతుల సరళీకరణతో ఎందరో పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నారని అన్నారు. పారిశ్రామికీకరణలో దేశంలోనే ప్రథమస్థానంలో తెలంగాణ ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుతో 2.3 లక్షలమందికి ఉపాధి అవకాశాలు రానున్నట్టు మంత్రి కెటిఆర్ వెల్లడించారు. భవిష్యత్‌లో మరిన్ని పరిశ్రమలను రాష్ట్రానికి ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని వెల్లడించారు. న్యూకాన్ చైర్మన్, ఎండి హేమంత్ జలాన్ మాట్లాడుతూ గత మూడు దశాబ్దాల్లో న్యూకాన్ అసలైన గ్లోబల్ లీడర్‌గా ఎదగిందన్నారు. నిబద్ధత కలిగిన నిపుణులతోపాటు, ప్రపంచంలో అత్యుత్తమ సాంకేతికత స్వీకరించడం, అత్యంత నైపుణ్యం కలిగిన సిబ్బంది నడుమ ఆవిష్కరణలను ప్రోత్సహించడం జరుగుతుందని వివరించారు. హైదరాబాద్‌కు విస్తరించిన కేంద్రం ద్వారా విమానయాన, రక్షణరంగ ఉత్పత్తులపరంగా ప్రతిష్టాత్మక స్థానం సంపాదించి, పలు ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో పరిష్కారాలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, డిజి మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ అండ్ సైంటిఫిక్ అడ్వైజర్ జి సతీష్‌రెడ్డి, లిక్విజ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్ సోమనాథ్, బిడిఎల్ సిఎండి ఉదయభాస్కర్, ఆర్‌సిఐ డైరెక్టర్ నారాయణమూర్తి, డిఆర్‌డిఎల్ అసోసియేట్ డైరెక్టర్ చంద్రవౌళి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..న్యూకాన్ సంస్థ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి కెటిఆర్, సంస్థ ప్రతినిధులు