రాష్ట్రీయం

భూములపై ఏరియల్ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాకరంగా చేపట్టనున్న భూమి సర్వే ప్రాజెక్టుకు హెలికాప్టర్లను రంగంలో దింపనుంది. దాదాపు రూ.500కోట్ల వ్యయంతో అమలు చేసే ఈ ప్రాజెక్టుతో భూమి వివాదాలకు తెరపడనుంది. రాష్ట్రం మొత్తం 2.7 కోట్ల ఎకరాల్లో అంటే నగరం, పట్టణం, గ్రామం అన్ని ప్రాంతాలను కలిపి సర్వే చేస్తారు. హెలికాప్టర్లలో డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డిజిపిఎస్)ను అమర్చుతారు. ఏరియల్ టెక్నాలజీ వల్ల గంటకు ప్రతి వంద చ.కిమీ మేర ఫోటోగ్రఫీ తీసే సదుపాయం అమలులోకి వచ్చింది. అలాగే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ టెక్నాలజీ (లైడర్) టెక్నాలజీ సేవలను ఉపయోగించనున్నారు. వచ్చే మూడు నెలలు ఈ రెండు టెక్నాలజీలను ఉపయోగించి డిజిటల్ మ్యాపింగ్ చేస్తారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో గతంలో లైడర్ సేవలను ప్రభుత్వం ఉపయోగించింది. దీని వల్ల భూమి సర్వేలో నూటికి నూరు శాతం కచ్చితత్వాన్ని సాధిస్తారు. ఒక వైపు గగనతలం నుంచి సర్వే చేయడంతో పాటు సుశిక్షితులైన 3500 మంది రెవెన్యూ సిబ్బందితో మాన్యువల్ పద్ధతిలో కూడా సర్వే చేస్తారు. గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో ఈ పద్ధతిలోనే భూమి సర్వే చేశారు. ఏరియల్ సర్వే ద్వారా తీసిన డిజిటల్ మ్యాపులు, రికార్డులతో ఇప్పటికే ఉన్న రికార్డులు, మ్యాపులతో పోలుస్తారు. అనంతరం యాజమాన్య హక్కులు, ఆస్తుల సరిహద్దులను ఖరారు చేస్తారు. ఆన్‌లైన్‌లో సర్వే నంబర్‌ను క్లిక్‌చేస్తే తమ ఆస్తుల మ్యాపుల వివరాలను ప్రజలు తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం పాస్‌పోర్టుల తరహాలోనే డిజిటలైజ్డ్ పట్టాదార్ పుస్తకాలను తయారుచేస్తారు. ఇందులో భూమి రికార్డుల వివరాలను అన్ని రకాల ఐటి సెక్యూరిటీ ఫీచర్లతో సమకూరుస్తారు. భూ యజమానుల ఆస్తుల లావాదేవీలు జరిగిన వెంటనే ఎస్‌ఎంఎస్ సందేశం వస్తుంది. ఈ తరహాలో భూమి రికార్డులను డిజిటలైజేషన్ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు. ప్రతి సర్వే భూమికి, అందులోని ఆస్తులకు విశిష్ట సంఖ్యను ఇవ్వనున్నారు. బ్యాంకు రికార్డుల మాదిరిగా భూమి రికార్డులను కొత్త పద్ధతి అమలులోకి వచ్చిన తర్వాత అమలు చేస్తారు.
నిజాం కాలంలో 1930లో చివరిసారిగా భూమి సర్వే జరిగింది. అప్పటి రికార్డులనే ఇప్పటికీ ప్రామాణికంగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల అనేక భూ వివాదాలు తలెత్తుతున్నాయి. కెసిఆర్ ప్రభుత్వం 2015లో ప్రయోగాత్మకంగా ఆరునెలలు భూ సర్వే చేపట్టింది. ఇందులో లక్షల సంఖ్యలో దోషాలు కనపడ్డాయని రెవెన్యూ అధికార వర్గాలు తెలిపాయి. సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం, ముత్తాతల పేర్లు మీద ఆస్తి నమోదు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డులకు పొంతన లేకపోవడం, మ్యుటేషన్‌లో పొరపాట్లు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు.