రాష్ట్రీయం

రెండు రాష్ట్రాల ఉద్యోగుల మార్పిడి కొలిక్కి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ మాతృ రాష్ట్రానికి బదిలీ చేసేందుకు వీలుగా త్వరలో రెండు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశమై మార్గదర్శకాలు ఖరారు చేయనున్నారు. సమాన సంఖ్యలో ఉద్యోగులను సర్దుబాటు చేసే ప్రతిపాదనను అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు గడచిన తర్వాత కూడా ఆంధ్రాలో తెలంగాణకు చెందిన 1053 మంది ఉద్యోగులు, తెలంగాణలో ఆంధ్రాకు చెందిన 181 మంది ఉద్యోగులు వేరు వేరు క్యాడర్లలో పనిచేస్తున్నారు. వీరు తమ మాతృ రాష్ట్రానికి బదిలీ చేస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే తమ శాఖాధిపతులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఆంధ్రాలో తెలంగాణకు చెందిన 800 మంది నాల్గవ తరగతి ఉద్యోగులు, 240 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, 13 మంది గెజిటెడ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన నలుగురు నాల్గవ గ్రేడ్ ఉద్యోగులు, 61 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, 117 మంది గెజిటెడ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆంధ్రాలో, తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులు తమను సొంత రాష్ట్రాలకు పంపించి వేయాలంటూ గత మూడేళ్లుగా ముఖ్యమంత్రులకు, ప్రధాన కార్యదర్శికి వినతిపత్రాలు ఇచ్చారు. పైగా సొంత రాష్ట్రంలో పనిచేస్తున్న గెజిటెడ్ ఉద్యోగులకు పదోన్నతులు కూడా లభించనున్నాయి. ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన 800 మంది నాల్గవ తరగతి ఉద్యోగుల విషయంలోనే ప్రతిష్టంభ ఏర్పడింది. నాల్గవ తరగతి, నాన్ గెజిటెడ్, గెజిటెడ్ ఉద్యోగుల మార్పిడికి సంబంధించి సమాన సంఖ్యలోనే బదిలీ చేస్తే కొంతలో కొంత సమస్యలను తగ్గించే యోచనలో ప్రభుత్వాలు ఉన్నట్లు సమాచారం. ఈ ఫార్ములా వల్ల ఆంధ్రాలో పనిచేస్తున్న నాల్గవ తరగతి ఉద్యోగులకు ఉపశమనం కలిగే అవకాశాలు లేవని సంఘాలు తెలిపాయి.