రాష్ట్రీయం

హైదరాబాద్‌లో పిటిఇ టెస్టింగ్ సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: ప్రపంచ అగ్రగామి అభ్యసన కంపెనీ పియర్సన్ నేడిక్కడ తన డెడికేటెడ్ పియర్సన్ టెస్టు ఆఫ్ ఇంగ్లీషు అకాడమి(పిటిఇ)ని ప్రారంభించింది. హైదరాబాద్‌తో పాటు అమృత్‌సర్, లూథియానా, పూణెలలో కూడా ఈ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు సంస్థ వైస్ ప్రెసిడెంట్ వికాస్ తెలిపారు. అభ్యర్థులు వేగంగా సులభంగా ఇంగ్లీషు లాంగ్వేజి టెస్టుకు హాజరయ్యేందుకు ఇది వీలుకల్పిస్తుంది. దీంతో పాటు పియర్సన్, విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్ధుల కోసం అంతర్జాతీయ గుర్తింపు పొందిన వేగవంతమైన, విశ్వసనీయమైన పరీక్షను 19 నగరాల్లోని 28 కేంద్రాల్లో నిర్వహిస్తోంది. పరీక్షకు హాజరుకాదల్చిన వారు 48 గంటలు ముందుగా లేదా అంతకన్నా తక్కువ వ్యవధిలోనే టెస్టు కోసం బుక్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. అలాగే ఐదు పనిదినాల్లో వారు తమస్కోర్‌ను తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. పిఇటి అకడమిక్ అనేది కంప్యూటర్ ఆధారిత లాంగ్వేజి టెస్టు , అంతర్జాతీయ విద్యార్ధులు, ఉద్యోగార్థులకు వేగవంతమైన పారదర్శకమైన సరళవంతమైన రీతిలో సామర్థ్య విశే్లషణలను నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా పిటిఇ అకడమిక్ వివిధ అకడమిక్ ప్రొగ్రాంలతో పాటు వలస మరియు విద్యార్థి వీసా దరఖాస్తులకు సంబంధించి ఆస్ట్రేలియా ప్రభుత్వ వలస, సరిహద్దు రక్షణ విభాగం ఆమోదించే కోర్సులనూ నిర్వహిస్తోంది. ఆస్ట్రేలియా, ఐర్లాండ్, న్యూజిలాండ్‌లలో 100 శాతం యూనివర్శిటీలు ఈ టెస్టును అంగీకరిస్తున్నాయి.