రాష్ట్రీయం

మీకు నేనే అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఆగస్టు 20: రాష్ట్రంలో కాపు, బలిజలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించి అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహిస్తోంది తెలుగుదేశం ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇక్కడ ఆదివారం నిర్వహించిన బలిజల ఆత్మీయ సదస్సుకు ముఖ్యఅతిధిగా హాజరైన సిఎం మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో కాపు, బలిజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే సీట్లు కేటాయించామన్నారు. నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాపులను బిసిల్లో చేర్చేందుకు మంజునాథ కమిషన్ ఏర్పాటు చేశానని, కమిషన్ నివేదిక అందిందని, త్వరలో శాసనసభలో ప్రవేశపెడతామన్నారు. సామాజిక న్యాయం గురించి తాను విద్యార్థి దశలోనే నేర్చుకున్నానని, అందుకే విద్య, ఆర్థిక రంగాల్లో వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామన్నారు. కాపులకు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. తద్వారా అన్ని రకాలుగా ఆర్థికంగా కాపు, బలిజలు నిలదొక్కుకుంటారన్నారు. వైకాపా అభ్యర్థి నంద్యాలలో చేసిన ఆగడాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయన్నారు. అమ్మాయిలను మానభంగం చేసి చంపేసి కేసు కూడా పెట్టకుండా చేశారని, సహకార వ్యవస్థ అని పెట్టి మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్న సొసైటీపై విచారణ చేసి నిగ్గు తేలుస్తామన్నారు. మహిళలకు ప్రభుత్వం మెప్మా ద్వారా వడ్డీలేని రుణాలు, సబ్సిడీలు ఇస్తుండగా, వైకాపా అభ్యర్థి తన స్వలాభం కోసం ఆడవారిని చేరదీసి వడ్డీలేని రుణాల పేరిట జులుం చేస్తున్నారని ఆరోపించారు. ఆ వ్యవస్థలో తీసుకున్న రుణాలు ఎవరూ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. చేసే పనులన్నీ తప్పుడు పనులేనని, లాభం లేనిది ఏ పని చేయరన్నారు. కుందూనది విస్తరణ కోసం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేశారని, భూగర్భ డ్రైనేజి కోసం ఇచ్చిన డబ్బులు ఏ విధంగా మాయం చేశారో మీకు తెలుసన్నారు.
డబ్బులు వసూలు చేసుకోవడం తప్ప నంద్యాలకు ఏమి ఒరగబెట్టింది లేదన్నారు. అధికార దుర్వినియోగం చేసి బయట వ్యాపారాలు చేసుకుంటున్నారని ఇలాంటి అవినీతి పరమైన వ్యక్తులు మీకు అవసరమా అని ప్రశ్నించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అయినా మీ కోసం వాటిని భరిస్తున్నానన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా మీ అవసరాలను నెరవేర్చే బాధ్యత తనదని, రేపు ఎలాంటి కానుక నాకు ఇస్తారో చూస్తాను. గెలువడం కాదు భారీ మెజార్టీ సాధించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధికే మా ఓటు, అవినీతికి కాదని చాటి చెప్పాల్సిన బాధ్యత నంద్యాల ఓటర్లపై ఉందన్నారు. సియంనే నడిరోడ్డుపై కాల్చివేస్తామని చెబుతున్న నాయకులు మీ పరిస్థితిని ఎలా పట్టించుకున్నారన్నారు. ప్రతిపక్ష నేత ఎన్ని మాటలన్నా, బాధకలిగినా ప్రజలు ఆనందంగా ఉండడం కోసం ఎంతైనా భరిస్తానన్నారు. అవినీతి లేని సుపరిపాలన ఇస్తున్నాం, రోడ్లు వెడల్పు చేయాలని 98 శాతం ప్రజలు అడుగడంతోనే పనులు ప్రారంభించామన్నారు. శిల్పా భూకబ్జా బాదితులను ఆదుకుంటామన్నారు. అంతకు ముందు జరిగిన ముస్లిం మైనారిటీల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈసారి రూ.740 కోట్లు కేటాయించామన్నారు. నంద్యాల నేతలు ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి, నౌమాన్‌కు ఉర్దూ అకాడమి చైర్మన్ పదవి ఇచ్చానన్నారు. ఈ సమావేశంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, గంటా శ్రీనివాసులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, స్థానిక బలిజ సంఘం నాయకులు శాంతిరామ్ విద్యాసంస్థల అధినేత మిద్దె శాంతిరాముడు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రామచంద్రరావు, వర్థంశెట్టి రాజారాం, డా.రవికృష్ణ, రాజశేఖర్ పాల్గొన్నారు.

చిత్రం..నంద్యాలలో జరిగిన బలిజల ఆత్మీయ సదస్సులో ప్రసంగిస్తున్న చంద్రబాబునాయుడు