రాష్ట్రీయం

మంచినీటికే కృష్ణమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: ఆంధ్ర, తెలంగాణలో కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల జలాశయాల్లో నీరు అడుగంటింది. నీటి లభ్యత లేకపోవడంతో ఉన్న నీటిని కేవలం మంచినీటి అవసరాలకే ఉపయోగించాలని, ఎటువంటి పరిస్ధితుల్లో ఖరీఫ్ పంటలకు ఉపయోగించేందుకు వీలు లేదని కృష్ణా బోర్డు స్పష్టం చేయనుంది. వ్యవసాయానికి సాగునీటి విడుదల చేయాలని ప్రణాళికలు వేసుకోకూడదని, ఇప్పుడున్న నీరు మంచినీటి అవసరాలకు కూడా సరిపోదని కృష్ణాబోర్డు అంచనాకు వచ్చింది. ఏదో మహాద్భుతం జరిగి సెప్టెంబర్, అక్టోబర్ నెలలో భారీ వరదలు వస్తే తప్ప శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు నిండవు. ఈ పరిస్ధితుల్లో నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టును నమ్ముకుని వ్యవసాయం చేయాలనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఈ విషయాన్ని రైతాంగానికి కరాఖండిగా చెప్పాలని కృష్ణాబోర్డు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలను కోరనుంది. ఈ నెల 22వ తేదీన అమరావతిలో కృష్ణా బోర్డు మీటింగ్‌కు రెండు రాష్ట్రాల సాగునీటి మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శులు, ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు హాజరుకానున్నారు. మంత్రులు హజరయ్యే సంగతి ఇంకా ఖరారు కాలేదు.
ఈ సమావేశాన్ని బోర్డు మెంబర్ సెక్రటరీ సమీర్ చటర్జీ నిర్వహించనున్నారు. ఆగస్టు మూడో వారం వచ్చినా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోకి నీరు రాలేదు. ఈ సమయంలో రెండు రాష్ట్రాలు విజిలెంట్‌గా ఉండాలని చెప్పనున్నట్లు బోర్డు అధికార వర్గాలు తెలిపాయి. తొలిసారిగా హైదరాబాద్ వెలుపల కృష్ణా బోర్డు మీటింగ్ జరుగుతోంది. ఈ సమావేశంలో 2017-18 నీటి వినియోగంపై చర్చించే అవకాశాలు లేవన్నారు. 40 టిఎంసి నీటిని ఉపయోగించుకున్న ఆల్మట్టి ఈ సీజన్‌లో కర్నాటకలోని ఆల్మట్టి డ్యాంకు 156 టిఎంసి వస్తే, అందులో 40 టిఎంసి నీటిని కాల్వల ద్వారా, నారాయణ్‌పూర్‌కు విడుదల చేసి పంటలకు సాగునీటిని విడుదల చేశారు. అదృష్టవశాత్తు తెలంగాణలోని జూరాలకు 13 టిఎంసి నీరు వచ్చింది. ఈ నీరు బీమా నది నుంచి వచ్చింది. గోదావరి ప్రాజెక్టుల సంగతి అంతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమయ్యే ప్రదేశంలో ప్రాణహిత ద్వారా 250 టిఎంసి నీరు చేరితే, ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా బంగాళాఖాతంలో కలిశాయి. ఈ సీజన్‌లో 391 టిఎంసి నీరు ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా సముద్రంలో కలిశాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, లోయల్ మానేరు డ్యాం, యల్లంపల్లిలో మంచినీటి అవసరాలకు మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. గోదావరిలో ప్రాజెక్టులు లేక నీరు సముద్రంలో కలిస్తే, నాగార్జునసాగర్‌లో ఆగస్టు మూడో వారంలో 115.78 టిఎంసి, శ్రీశైలంలో 20.56 టిఎంసికి నీటి మట్టం పడిపోయింది. శ్రీశైలంలో మొత్తం కెపాసిటీలో పదిశాతం నీరుంటే, నాగార్జునసాగర్‌లో 38 శాతం నీరుంది.