రాష్ట్రీయం

అన్నదాత అగచాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 20: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో పంటల సాగులో ఆశించిన పురోగతి కుంటుపడింది. ఆగస్టు చివరి వారంలోకి ప్రవేశించినా రాష్ట్రంలో వివిధ పంటల సాగు విస్తీర్ణం 58 శాతానికి మించకపోవడం గమనార్హం. రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 42.06 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటల సాగును ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. అయితే ఇప్పటివరకూ 23.53 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు వేశారు. లక్ష్యంలో దాదాపు 58 శాతం మేర మాత్రమే పంటలు వేసినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.
సాధారణంగా ఈ సమయానికి దాదాపు 89శాతం మేర పొలాలు సాగులోకి రావాల్సి ఉంటుంది. విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంలో 55 శాతానికి పంటల సాగు మించకపోవడం గమనార్హం. పంటల వారీగా పరిశీలిస్తే వరి 56 శాతం మేర సాగు చేశారు. వరి పంట సాగు లక్ష్యం 16.25 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటివరకూ 8.6 లక్షల హెక్టార్లలో మాత్రమే వరినాట్లు వేశారు. వివిధ రకాల పప్పు్ధన్యాల సాగు 69 శాతం, వేరుశనగ 52 శాతం, పొద్దుతిరుగుడు పువ్వు 10 శాతం, వివిధ నూనె ఉత్పత్తులకు సంబంధించిన పంటలు 50 శాతం, మిరప 16 శాతం, ఉల్లి 40 శాతం, పొగాకు 9 శాతం మేర మాత్రమే సాగుచేశారు. మిర్చి పంట 1.27 లక్షల హెక్టార్లల్లో సాగుచేయాల్సి ఉండగా ఇప్పటివరకూ కేవలం 27 వేల హెక్టార్లలో మాత్రమే సాగు చేస్తున్నారు. సాగర్ జలాశయాల నుంచి నీటి విడుదలపై మిర్చి రైతుల ఆశగా ఎదురుచూస్తున్నారు. నారు ముదిరిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో సాధారణం కంటే 17.6 శాతం మేర వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో వేరుశనగ పంటకు ప్రత్యామ్నాయంపై రైతులు దృష్టి సారించాలని ఇప్పటికే ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇతర పంటలు వేసిన రైతులకు ప్రభుత్వం కొన్ని రాయితీలు ప్రకటించింది. తగినంత నీటి వనరులు లేక పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. వర్షాభావంతో పాటు వివిధ జలాశయాల్లో నీరు తగినంతగా లేకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. రాష్ట్రంలో ఈ నెల 20 నాటికి సాధారణ వర్షపాతం కంటే 5.2 శాతం తక్కువగా వర్షపాతం నమోదయింది. ఈ ఏడాది జూన్‌లో సగటు కంటే 29 మిల్లీమీటర్లు తక్కువ వర్షం కురిసింది. జూలైలో సగటు కంటే 36 మిల్లీమీటర్లు ఎక్కువగా కురిసినప్పటికీ దానివల్ల రైతులకు పెద్దగా మేలు జరగలేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలులో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీనికితోడు నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల జలాశయాల్లో ఆశించిన స్థాయిలో నీరు లేక దాని ప్రభావం పంటల సాగుపై పడుతోంది.