రాష్ట్రీయం

క్రికెట్ బెట్టింగ్ కేసులో.. వైకాపా ఎమ్మెల్యేలకు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఆగస్టు 20: నెల్లూరు జిల్లాలో సంచలనం రేపుతున్న క్రికెట్ బెట్టింగ్ కేసులో తాజాగా మరో సంచలనం నమోదైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల ప్రమేయం ఈ బెట్టింగ్ వ్యవహారాల్లో ఉందనే సమాచారం మేరకు ఇద్దరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పోలీస్ శాఖ నోటీసులు జారీ చేసింది. వైకాపాకు చెందిన నెల్లూరు నగర ఎమ్మెల్యే పొలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డిలకు ఈ నోటీసులను జారీ చేశారు. నోటీసుల్లో పేర్కొన్న సమాచారం మేరకు.. ఈనెల 22న వారిద్దరూ నెల్లూరు అదనపు ఎస్పీ బి.శరత్‌బాబు ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తమ వద్ద ఉన్న సమాచారం మేరకు బెట్టింగ్ వ్యవహారాల్లో ఎమ్మెల్యేలిద్దరి ప్రమేయంపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అయితే విచారించాక పూర్తి స్పష్టత ఇవ్వగలమని చెప్పారు. ఇప్పటికే రాష్టవ్య్రాప్తంగా సంచలనం కలిగించిన కేసులో ఇప్పటివరకు 205మంది నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా 72మందికిపైగా బుకీలు, పంటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలకు ఈ కేసులో సంబంధం ఉందనే సమాచార నేపథ్యంలో పోలీస్ శాఖ విచారణకు నోటీసులివ్వడంతో కేసు రాజకీయ రంగు పులుముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న సదరు ఇద్దరు ఎమ్మెల్యేలకు అక్కడే నోటీసులు అందించేందుకు పోలీస్ శాఖ సమాయత్తమైంది.