రాష్ట్రీయం

ఎక్కడి గొంగళి అక్కడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: ‘నిధుల కొరత లేదు, ప్రభుత్వానికి సంబంధించి అన్ని అనుమతులూ ఉన్నాయి. నిధులు విడుదలైనా అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనన్న చందంగా మారింది’. ఈ వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీలో, ప్రజాసంఘాలో, ప్రభుత్వమంటే గిట్టని వారు చేసిన విమర్శలో కావు. స్వయంగా పాలకపక్షానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధుల మనోగతం ఇది. ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కె తారకరామారావు సమక్షంలో ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా ఒకే రకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ కార్యకలాపాలు మందగించాయని ప్రజా ప్రతినిధులు వాస్తవ పరిస్థితులను కెటిఆర్‌కు స్వయంగా కళ్లముందుంచారు. అదే జిల్లాకు చెందిన మంత్రి ఈటల రాజేందర్ తన ఇంట్లో స్వయంగా రెండు రోజుల కిందట ఆ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముక్తకంఠంగా వాపోయారు. ఈ అభిప్రాయం ఒక్క కరీంనగర్ జిల్లాకు మాత్రమే పరిమితం కాదు. దాదాపు అన్ని జిల్లాల్లో పాలకపక్షానికి చెందిన ప్రజా ప్రతినిధుల ఇదే రకమైన అభిప్రాయంతో ఉన్నారు. తమ ప్రభుత్వంపై తామే విమర్శలు చేయలేని నిస్సహాయ స్థితిలో వారు తమ అంతర్గత సంభాషణల్లోనూ ఇదే రకంగా మాట్లాడుకుంటున్నారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల ఏర్పాటుకు గత బడ్జెట్‌లోనే రూ.10 వేల కోట్ల మేర నిధులు కేటాయించింది. వీటికి అదనంగా ప్రస్తుతం బడ్జెట్‌లో మళ్లీ నిధులు మంజూరు చేశారు. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు పరమ ఆధ్వానంగా మారిపోయాయి. అవిభక్త వరంగల్ జిల్లాలోని పాలకుర్తి పర్యటనకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు వెళ్లినప్పుడు రోడ్ల దుస్థితి చూసి ఆయనే ఆశ్చర్యపోయారు. రోడ్లు మరీ ఇంత దారుణంగా తయారైతే ఏమి చేస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో దుస్థితిపై ముఖ్యమంత్రే స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేశారంటే వాటి పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే రాష్టవ్య్రాప్తంగా డిసెంబర్ నెలాఖరు నాటికి రెండు లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి చూపిస్తామని ముఖ్యమంత్రి స్వయంగా శాసనసభలో ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటనపై అదే సభలో ప్రధాన ప్రతిపక్షానికి చెందిన సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రెండు లక్షల ఇళ్లు డిసెంబర్ వరకు కట్టించి ఇవ్వడం అసాధ్యమని గట్టిగా వాదించారు. మాటలు చెప్పం.. చేసి చూపిస్తామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ప్రభుత్వం ప్రతి సవాల్ కూడా విసిరింది. కానీ, వాస్తవ పరిస్థితికి వస్తే రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం ఎక్కడ కూడా ఊపందుకోలేదు. ఇంకా చాలా జిల్లాల్లో వీటికి టెండర్లు కూడా ఖరారు కాలేదు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించడానికి కాంట్రాక్టర్లు ఇప్పటికీ ముందుకురాని పరిస్థితే నెలకొంది. ఇదే విషయాన్ని కరీంనగర్ జిల్లా ప్రజా ప్రతినిధుల సమావేశంలోనూ వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంటింటికి మంచినీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ పథకం పరిస్థితి కూడా ఇలాగే మారిందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ పథకం ద్వారా డిసెంబర్ నాటికి రాష్టవ్య్రాప్తంగా ప్రతీ ఇంటికి మంచినీటి సరఫరా చేయనున్నట్టు శాసనసభ లోపల, వెలుపల పలు సభల్లో ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రుల వరకు ప్రకటించారు. వాస్తవానికి ఇప్పటి వరకు వేలాది గ్రామాలకు మంచినీటి సరఫరా పైపులను వేయలేదని సమాచారం. గడువులోగా ఇంటింటికి మంచినీటి సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడటంతో రెండు దశలలో ఈ పథకాన్ని పూర్తి చేయనున్నట్టు తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. మొదటి దశలో సగం జిల్లాలు, మలి దశలో మిగిలిన జిల్లాలకు మంచినీటి సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించారు. తొలి దశలో డిసెంబర్ నాటికి మంచినీటి సరఫరా చేస్తామని ఇది వరకే ప్రకటించడంతో, రెండవ దశకు ఎప్పటిలోగా సరఫరా చేస్తారో ప్రకటించలేదు. నిధుల కొరత లేదు. బడ్జెట్‌లో తగిన కేటాయింపులు జరిగాయి. పాలనాపరమైన అనుమతులు కూడా లభించాయి. మరి పనులు ఎందుకు మందగించాయని పాలకపక్ష ప్రజాప్రతినిధులే ప్రభుత్వ యంత్రాంగంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం అధికార పక్షంలోనే వ్యక్తం అవుతుంది.