రాష్ట్రీయం

సెప్టెంబర్, నవంబర్‌లో జాతీయ గణిత పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, ఆగస్టు 20: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని రామానుజన్ గణిత అకాడమీ 28వ జాతీయ గణిత పోటీల్లో భాగంగా సెప్టెంబర్ 3న ప్రిలిమినరీ, నవంబర్ 5న ఫైనల్ పరీక్షను నిర్వహించేందుకు సమాయత్తమైంది. ఆదివారం ఇందుకు సంబంధించిన వివరాలను వ్యవస్థాపక అధ్యక్షుడు కెవివి సత్యనారాయణ, కార్యదర్శి ఎం నాగార్జున ప్రకటించారు. నాల్గవ తరగతి నుంచి ఎంఎస్సీ వరకూ విద్యార్జన చేసే విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హులన్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోను, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని అన్ని ప్రాంతాలల్లోను ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. జాతీయ స్థాయిలో గణిత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు డిసెంబర్ 22న గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని బహుమతులు అందజేయనున్నట్టు చెప్పారు. అదేవిధంగా గణితశాస్త్ర పరంగా విశేష కృషి సల్పిన నలుగురు గణితవేత్తలను గౌరవించుకోవడం సాంప్రదాయంగా వస్తోందని, వారి ఎంపిక కార్యక్రమం త్వరలో జరగనుందని వ్యవస్థాపక అధ్యక్షుడు కెవివి సత్యనారాయణ తెలిపారు. విద్యార్థులు గణిత శాస్తప్రరంగా విభిన్నతత్వంతో సమస్యలను సాధించాలని ఆయన కోరారు. ఈసందర్భంగా పోటీల బ్రోచర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అకాడమీ కార్యవర్గ సభ్యులు ముమ్మిడి సత్యనారాయణరావు, ఉప్పలపాటి మాచిరాజు, అడపా సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.