రాష్ట్రీయం

అవసరమైన వెంటనే విద్యుత్ సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: దక్షిణాది రాష్ట్రాల మధ్య విద్యుత్ ఇచ్చి పుచ్చుకునేందుకు సరికొత్త విధానం అనుసరించే విషయంలో భాగస్వామ్య రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి విద్యుత్ అవసరం ఉన్నా, వెంటనే పక్క రాష్ట్రాల నుంచి పొందే విధంగా ఈ విధానానికి రూపకల్పన చేశారు. ఈ విధానం అమల్లోకి వస్తే పవర్ ఎక్స్ఛేంజ్ జోక్యం లేకుండా ఎలాంటి జాప్యానికి అవకాశం లేకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాలు విద్యుత్ ఇచ్చిపుచ్చుకునే వెసులుబాటు కలుగుతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన విద్యుత్ సంస్ధలు ఒప్పందం ఖరారు చేయనున్నాయి. మంగళవారం దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ కమిటీ సమావేశం తిరువనంతపురంలో జరిగింది. దీనికి చైర్‌పర్సన్, తెలంగాణ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు అధ్యక్షత వహించారు. గత నెలలో హైదరాబాద్‌లో కొత్త విద్యుత్ విధానంపై సమావేశం జరిగింది. ఈ సమావేశాల్లోనే కమిటీ కార్యదర్శి ఎస్‌ఆర్ భట్ నేతృత్వంలో కమిటీని నియమించారు. కొత్త విధానానికి సంబంధించిన ఈ కమిటీ ముసాయిదాను తయారుచేసి తిరువనంతపపురం సమావేశంలో ప్రవేశపెట్టారు. దీనిపై రెండు రోజుల చర్చ 21,22 తేదీల్లోజరిగింది.
విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా విషయాల్లో పరస్పరం సహకరించుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యుత్ కొనుగోళ్లన్నీ పవర్ ఎక్స్ఛేంజీ ద్వారా జరగాలి. ఈ విధానం కింద ఒక రోజు ముందుగానే సమాచారం ఇచ్చే పరిస్ధితి అమలవుతోంది. ఒక రోజు ముందు అంచనా వేయడం వల్ల వాస్తవ పరిస్థితికి తగ్గట్టుగా ఉండడం లేదు. ఈ పరిస్థితిని నివారించేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు కేవలం గంట వ్యవధిలోనే పక్క రాష్ట్రం నుంచి విద్యుత్ పొందవచ్చును. దీని వల్ల కొరత ఉన్న రాష్ట్రాలు, మిగులు రాష్ట్రాలు రెండూ లాభపడుతాయి. ఎవరికి విద్యుత్ కావాలన్నా ఎవరు విద్యుత్ ఇవ్వాలనుకున్నా సమాచారాన్ని సదరన్ లోడ్ డిస్పాచింగ్ సెంటర్‌కు సమాచారం అందించాలి. దక్షిణాది రాష్ట్రాల మధ్య విద్యుత్ అంది పుచ్చుకోవడం సదరన్ లోడ్ డిస్పాచింగ్ సెంటర్ ద్వారానే జరుగుతాయి. త్వరలో ఈ ముసాయిదా అమలుకు విధి విధానాలు ఖరారు చేయాలని నిర్ణయించినట్లు దేవులపల్లి ప్రభాకరరావు తెలిపారు.