రాష్ట్రీయం

అభివృద్ధే అజెండా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఆగస్టు 22: నంద్యాలలో నేడు జరగనున్న ఉప ఎన్నిక రాష్టవ్య్రాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ఉప ఎన్నిక కావటంతో అన్ని వర్గాల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది. ఉప ఎన్నిక చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌ల మధ్య వ్యక్తిగతంగా జరుగుతున్న పోటీని తలపిస్తోంది. ప్రచారం, డబ్బు పంపిణీ, ఇంటింటికీ వెళ్లి ఓటడిగే ప్రక్రియ ముగియడంతో, మంగళవారం అర్థరాత్రి నుంచి బెట్టింగులు పరాకాష్టకు చేరాయ. ఈ ఎన్నికలో విజయాన్ని నిర్దేశించేది ప్రధానంగా నంద్యాల పట్టణమే. ఇక్కడ ముస్లిం మైనారిటీల సంఖ్య ఎక్కువ. ఈ వర్గం ఎటు మొగ్గితే విజయం వారినే వరిస్తుంది. తర్వాత వైశ్య వర్గమూ ఎక్కువే. విజయాన్ని ప్రభావితం చేసే మరో బలిజ వర్గం ఆశీస్సుల కోసం రెండు పార్టీలు ప్రయత్నించాయి. ఆయా కులాలకు చెందిన తమ పార్టీ నేతలను మోహరింపచేశాయి. కొద్దిరోజుల క్రితం వరకూ టిడిపికి దడ పుట్టించిన గోస్పాడు, నంద్యాల మండలంలో ఇప్పు డు బలబలాలు సమాన స్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు మండలాల్లోనే వైసీపీకి మెజారిటీ ఉందని ఆ పార్టీ కొద్దిరోజుల క్రితం చేయించిన తొలి సర్వేలో స్పష్టం చేయగా, రెండోసారి చేయించిన సర్వేలో మాత్రం పరిస్థితి తారుమారైనట్టు కనిపించింది. ప్రచారం ముగిసే నాటికి పట్టణంలో తెదేపాకే నాలుగు శాతం ఆధిక్యం ఉందని, వైసీపీకి రెండు ప్రధాన మండలాల్లో బలం గణనీయంగా తగ్గి, సమాన స్థాయికి చేరుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ రెండు మండలాల్లో వీలైనంత ఎక్కువ మెజారిటీ సాధించాలని వైసీపీ,

ఆ పార్టీ మెజారిటీని గణనీయంగా తగ్గించి పట్టణంలో ఉన్న మెజారిటీతో బయటపడాలని టిడిపి వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అటు పట్టణ ప్రజలు కూడా ఇవి జనరల్ ఎలక్షన్ కానందున, మరో పార్టీకి ఓటు వేసి, జరుగుతున్న అభివృద్ధిని ఎందుకు దూరం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది.
పట్టణంపైనే టిడిపి ఆశలు
* ఈ ఎన్నిక టిడిపికి సాంకేతికంగా ప్రధానం కాకున్నా, ఓడిపోతే 2019 ఎన్నికలకు ఇది సంకేతంలా మారవచ్చు. అదే జరిగితే ఇప్పటినుంచే వలసలు మొదలయ్యే అవకాశముంటుంది. అందువల్ల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అదే, గెలిస్తే పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపే అవకాశముంటుంది. ‘జగన్‌కు జనం వస్తారు తప్ప ఓట్లేయర’న్న ప్రచారాన్ని నిజం చేసే అవకాశం వస్తుంది.
* నంద్యాల పట్టణంలోని ముస్లిం, వైశ్య, బలిజ ఓట్లపైనే టిడిపి ఆశలు పెట్టుకుంది.
* ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇళ్ల నిర్మాణాలు, నగరంలో దివంగత భూమా నాగిరెడ్డి ఇమేజ్, గంగుల ప్రతాపరెడ్డి చేరిక, ఎవి సుబ్బారెడ్డి పలుకుబడి, కొత్తగా చేరిన ఇంతియాజ్ అహ్మద్, నౌమాన్, తబ్లిక్ జమాత్ అమీర్ సాబ్ హాజీ అబ్దుల్ కరీం వంటి కీలకమైన ముస్లిం నేతల ప్రభావంతో కనీసం 6-10వేల మెజారిటీతో గెలుస్తామన్న ధీమాతో ఉంది.
* ముస్లింలలో వైసీపీ అభ్యర్థి శిల్పాపై ఉన్న తీవ్ర వ్యతిరేకత అక్కరకొస్తుందని అంచనా వేస్తోంది.
* టిడిపికి ఓటు వేయకపోతే అభివృద్ధి పనులు నిలిచిపోవడంతోపాటు, రోడ్డు వెడల్పులో బాధితులకు నష్టపరిహారం ఆగిపోతుందని, ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోతాయని, ఈ ఎన్నికలో మరో అభ్యర్థి గెలిస్తే ఇవన్నీ తమకు దక్కవన్న ఆందోళన, ఈ ఒక్కసారికి టిడిపిని గెలిపించి, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తామంటున్న వివిధ వర్గాల భావన తమ పార్టీని గట్టెక్కిస్తుందని టిడిపి అంచనా వేస్తోంది.
* సూక్ష్మస్థాయిలో చేసిన ఎలక్షన్ మేనేజ్‌మెంట్, చేసిన ఖర్చు ఫలిస్తాయని ఆశిస్తోంది.
జగన్ ఇమేజ్‌పైనే వైసీపీ ఆధారం
* జగన్ రోడ్‌షోలో వెల్లువెత్తిన ప్రజాభిమానం, ఆయన ఇమేజ్ తమను గెలిపిస్తుందని వైసీపీ భావిస్తోంది.
* యువతకు నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణ మాఫీలో ప్రభుత్వ వైఫల్యాలు తమను గెలిపిస్తాయని అంచనా వేస్తోంది.
* పట్టణంలో బలహీనంగా ఉన్నప్పటికీ.. గోసుపాడు, నంద్యాల రూరల్‌లో ఉన్న పలుకుబడితో కనీసం 3వేలతోనయినా గెలుస్తామన్న ధీమాతో ఉంది.
* టిడిపి గెలవకపోతే అభివృద్ధి పనులు ఆగిపోతాయన్న జనంలో నెలకొన్న భావన తొలగించి, భరోసా ఇవ్వడంలో విఫలం చెందడంతోపాటు, అభ్యర్థి శిల్పాపై వివిధ వర్గాల్లో నెలకొన్న వ్యతిరేకతను తగ్గించుకోలేకపోయింది. ఇప్పటివరకూ ప్రజలు జగన్‌నే అభ్యర్థిగా చూస్తున్న పరిస్థితి మైనస్ పాయింటుగా మారింది.
* పార్టీలకు అతీతంగా ఓటు కోసం ఇంటింటికీ చేసిన ఖర్చు వల్ల, టిడిపి ఓట్లు కనీసం 2శాతం తగ్గిపోయి, పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందన్న అంచనాతో ఉంది.
* సొంత మీడియా సంస్థ ప్రతినిధులు నిరంతరం ఇస్తున్న సమాచారం, నివేదికలతో కొత్త వ్యూహం రచించుకుని బలహీనంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టడం వల్ల కొంత నష్టాన్ని పూడ్చుకోవడంలో విజయం సాధించింది.

చిత్రం..ఉప ఎన్నిక పోలింగ్‌కు సామగ్రిని సిద్ధం చేసుకుంటున్న ఎన్నికల సిబ్బంది