రాష్ట్రీయం

చట్టబద్ధంగానే జలాల పంపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న వాటాల ఆధారంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీ జరుగుతుందని, ఇందులో మరో ఆలోచనకు తావు లేదని కృష్ణానదీ యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. కృష్ణానది యాజమాన్య బోర్డు ఆరో సర్వసభ్య సమావేశం మంగళవారం ఇక్కడ జరిగింది. ఈ సందర్భంగా బోర్డు చైర్మన్ ఎస్‌కె వాస్తవ మాట్లాడుతూ ఎగువనున్న రాష్ట్రాలతో పాటు దిగువ రాష్ట్రాలు కూడా నీటిని వినియోగించుకోవడంలో సమాన భాగస్వాములనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కర్నాటకలోని వివిధ రిజర్వాయర్లలో నీరు సమృద్ధిగా ఉన్నందున దిగువ రాష్ట్రాలకు నీటిని విడుదల చేయాల్సి ఉందన్నారు. ఈ విషయమై కేంద్రానికి, బజాజ్ కమిటీకి లేఖలు రాయాలని తాము భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. నీటి పంపకాలు, వివాదాల పరిష్కారానికై అపెక్స్ కమిటీలు ఏర్పాటు చేయాలంటూ రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే లేఖలు రాశాయని, అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. నీటి పంపకాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్వల్ప భేదాభిప్రాయాలున్న విషయం వాస్తవమేనని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల దిగువన తొలి దశలో 18 టెలీ మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేశామని, రెండో దశలో మరో 29స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నా రు. శ్రీశైలం, సాగర్‌లలో నీటి లభ్యత తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ప్రో రేట్ ఆధారంగానే ఇరు రాష్ట్రాలు పంచుకోవాలని బోర్డు చైర్మన్ స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్ వాసుల మంచినీటి
అవసరాల కోసం 400 క్యూసెక్కుల నీటిని తెలంగాణా వాడుకుంటున్నదని తెలిపారు. ఒక్కోసారి సమాచార లోపం కారణంగాను, అలాగే మరికొన్నిసార్లు నీటి విడుదలలో ఏర్పడుతున్న ఆలస్యం కారణంగానూ స్వల్ప వివాదాలు తలెత్తుతున్నాయని బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ అన్నారు. ఈ సమావేశంలో ఏపి జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కుడి కాలువ నిర్వహణ మాకివ్వాలి: ఏపి
ఆంధ్రప్రదేశ్ భూభాగంలోని గుంటూరు జిల్లాలో ఉన్న నాగార్జునసాగర్ కుడి కాలువ ప్రధాన రెగ్యులేటర్ నీటి నిర్వహణ బాధ్యతను తమ ప్రభుత్వానికి అప్పగించాలంటూ బోర్డు చైర్మన్ ఎస్‌కె శ్రీవాస్తవను కల్సిన ఏపి జలవనరుల ఎపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ వై.పుల్లయ్య చౌదరి (కృష్ణా), కుడికాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ జివి భుజంగరాయలు (గుంటూరు), డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు నాదెండ్ల చెన్నకేశవరావు, కట్టా కోటయ్య తదితరులు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుదారులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలోనున్న జూరాల, శ్రీశైలం, సాగర్ తదితర ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకువచ్చి నీటి యాజమాన్యం మొత్తాన్ని చూడాలని కోరారు. సాగర్ ఎడమ కాలువ పరిధిలో గత సంవత్సరం బోర్డు 9.10 టిఎంసిల నీటిని కేటాయిస్తే ఆంధ్రకు కేవలం ఆరు టిఎంసిలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం మిగిలినది నష్టాలుగా చూపిందని ఆరోపించారు. ఇకపై ఆవిరి తదితర సమస్యలను లెక్కించడానికి ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు నీటి సంఘాల ప్రతినిధులతో బోర్డు ఓ సంయుక్త కమిటీని నియమించి పర్యవేక్షించాలని కోరారు.
ఈ స్థితిలో బోర్డు తక్షణం కేంద్రంతో సంప్రదించి సాగర్ రిజర్వాయర్ నుంచి కనీసం మంచినీటికైనా నీటిని విడుదల చేయించాలని కోరారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ప్రకాశం, గుంటూరు జిల్లాలోని మంచినీటి చెరువులకు, కుడి కాలువకు ఆరు టిఎంసిలు, కృష్ణా, ప.గో జిల్లాలో ఎడమ కాలువకు రెండు టిఎంసిల నీటిని కేటాయించాలని కోరారు. దీనిపై బోర్డు చైర్మన్ స్పందిస్తూ ఈ అంశాలన్నింటినీ పరిశీలించి ఆంధ్రప్రదేశ్ రైతులకు తగు న్యాయం చేయగలమంటూ హామీనిచ్చారు.

చిత్రం..విజయవాడలో జరిగిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం