రాష్ట్రీయం

సంక్షేమానికి పెద్ద పీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: గడచిన మూడేళ్లలో రాష్ట్రంలో సంక్షేమానికి రెండు లక్షల కోట్లు వెచ్చించామని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆమేరకు ఒక పుస్తకాన్ని వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఏడాదికి సగటున 65వేల కోట్లమేర సంక్షేమానికి వెచ్చించామన్నారు. రైతు రుణమాఫీకి రూ.24వేల కోట్లు, చేనేత సంక్షేమానికి రూ.111కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవలకు 211 కోట్లు ఖర్చు చేశారు. అంతకుముందు సచివాలయంలో మీడియా సమావేశంలో బాబు మాట్లాడుతూ టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ, అవినీతిని అరికట్టడమే ధ్యేయమని స్పష్టం చేశారు. ఇసుక తరలింపులో అక్రమాలకు పాల్పడేవారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. మహిళల మనోభావాలకు ప్రాధాన్యతనిస్తూ బెల్టుషాపులను నిర్మూలిస్తామని, ఇప్పటికే 2వేల షాపులను తొలగించామన్నారు. బెల్టు షాపుల నిర్మూలనకు మొబైల్ రైడింగ్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాల్ సెంటర్ 1100 ద్వారా ప్రజలతో మాట్లాడుతూ సమస్యలు పరిష్కారంలో అధికారుల జవాబుదారీతనం పెంచుతున్నామన్నారు. ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా చెక్‌పోస్టుల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో 150 రైతు బజార్లను త్వరలో ప్రారంభించనున్నట్టు చెప్పారు. వచ్చేనెల 5నుంచి జలహారతి నిర్వహిస్తామన్నారు. ప్రాజెక్టులు, చెక్‌డ్యాములు, పంట కుంటల వద్ద జలహారతి ఉంటుందన్నారు. కాల్‌సెంటర్ ద్వారా వైజాగ్ భూకుంభకోణంపై 2వేల ఫిర్యాదులు అందాయని తెలిపారు. భూముల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచుతామని, దీనివలన భవిష్యత్‌లో ట్యాంపరింగ్‌కు అవకాశం ఉందన్నారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన కృష్ణా జలాల వాటాపై అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఎగువ రాష్ట్రాలు కనీసం మానవ ధర్మాన్ని పాటించకుండా కింద రాష్ట్రాలకు రావాల్సిన నీటి వాటాను సైతం తమ డ్యాముల్లో నిల్వ చేస్తున్నామన్నారు. తమ రాష్ట్రాల్లోని చెరువులు, కాలువలకు నీటిని మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు తరలిస్తున్నాయన్నారు. దీనివలన ఏపితో పాటు తెలంగాణ కూడా నష్టపోతోందన్నారు. ప్రజలకు తాగునీరు ఇవ్వకుండా కర్కశంగా వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయనున్నామన్నారు. పేదల మాదిరిగానే హిజ్రాలకు పింఛన్లతోపాటు ఇతర సంక్షేమ పథకాలు వర్తింపచేసే యోచన ఉందన్నారు. వృద్ధులైన బిక్షగాళ్లకు ప్రత్యేక ఆశ్రమాలు ఏర్పాటుతోపాటు ఉపాధి కల్పించే ప్రతిపాదన ఉందన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్ తనను తిట్టి ప్రచారం పొందాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. సిఎం అనేది ఒక వ్యవస్థ అని, ముఖ్యమంత్రికే రక్షణ లేకపోతే సామాన్యుని పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. చంద్రన్న బీమాలో కొన్ని మార్పులు చేశామని, మృతుని కుటుంబానికి పెద్దకర్మ రోజునే బీమా మొత్తం చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దుల్హన్ పథకం కింద పెళ్లిరోజునే సంబంధిత మొత్తాన్ని అందించేలా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సెప్టెంబర్ 15 నుంచి రియల్ టైం గవర్నెన్స్‌ను సచివాలయంలోనే ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దీనివలన పరిపాలన మరింత సమర్థంగా సాగించే అవకాశం ఉంటుదన్నారు. నంద్యాలలో రోడ్లు వెడల్పు చేస్తామని చెబితే ఎన్నికలయ్యేంత వరకు ఆగమని కొంతమంది చెప్పారన్నారు. అయితే ప్రజల అభిప్రాయాన్ని ఐవిఆర్‌ఎస్ ద్వారా తెలుసుకుని ముందుకు పోయామని వివరించారు.