రాష్ట్రీయం

పెన్షన్‌పై ఉద్యోగుల పొలికేక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: తెలంగాణ ఆవిర్భావం తర్వాత మచ్చుకైనా కనిపించని ఉద్యోగ సంఘాల ఆందోళనలు వచ్చే నెలనుంచి తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకున్నా కేంద్రంపై వత్తిడితెచ్చి కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయించాలని డిమాండ్ చేస్తూ 3.5 లక్షలమంది ఉద్యోగులు సెప్టెంబర్ 1నుంచి పోరుబాట పట్టబోతున్నారు. సెప్టెంబర్ 1న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సాముహిక సెలవుకు పిలుపునిచ్చారు. కొత్త పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ అసొసియేషన్ ఇచ్చిన ఆందోళన కార్యక్రమాలకు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టిఎన్‌జివో), తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టిజిఎ) తమ సంపూర్ణ సంఘీభావం ప్రకటించాయి. కేంద్రం ప్రవేశపెట్టిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్)లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం 2004 సెప్టెంబర్ 1న చేరింది. పాత పెన్షన్ స్కీమ్ కొనసాగించడమా? కొత్త స్కీమ్‌లో చేరడమా? అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి కేంద్రం వెసులుబాటు కల్పించింది. పాత పెన్షన్ స్కీమ్‌వల్ల రాష్ట్రంపై పడే ఆర్థికభారాన్ని తగ్గించుకోవడానికి అప్పట్లో ఉమ్మడి ఆంధ్ర మొగ్గు చూపింది. ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కచేయకుండా కొత్త పెన్షన్ స్కీమ్‌ను అమలు చేసింది. 2004 సెప్టెంబర్ 1 కట్ ఆఫ్ డేట్‌గా విధించి ఈ తేదీ మొదలు నియామకమైన ఉద్యోగులను కొత్త పెన్షన్ స్కీమ్ పరిధిలోకి తీసుకొచ్చింది. అంతకుముందు నియామకమైన ఉద్యోగులకు మాత్రం పాత పెన్షన్ స్కీమ్‌ను వర్తింపచేసింది. తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, ఇతర సిబ్బంది మొత్తంగా కలిపి 3.4 లక్షల మంది ఉండగా, ఇందులో పాత పెన్షన్ స్కీమ్ పరిధిలో 2.4లక్షల మంది ఉన్నారు. కొత్త పెన్షన్ స్కీమ్ పరిధిలో లక్ష 10 వేల మంది ఉన్నారు. కొత్త పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేయాలని కొరుతూ, ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టిన నాటినుంచి ఉద్యోగ సంఘాలు ఏదోకవిధంగా తమ నిరసనను తెలియజేస్తున్నా ఇటు రాష్ట్రంనుంచి కానీ, అటు కేంద్రం నుంచి కానీ స్పందన లభించలేదు. గత మార్చిలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పది రోజులపాటు కొత్త స్కీమ్ రద్దుకోరుతూ ఉద్యోగ సంఘాలు థర్నాలు, దీక్షలు చేపట్టినా ఫలితం లేదు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, ఇతర సిబ్బంది సంఘాలన్నీ ఏకత్రాటిపైకి వచ్చి తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ అసొసియేషన్‌గా (టిఎస్‌సిపిఎస్‌ఇఏ) అవిర్భవించింది. దీనికి టిఎన్‌జివో, టిజిఏ సంఘాలతోపాటు పాత పెన్షన్ స్కీమ్ పరిధిలోని ఉద్యోగులు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. టిఎస్‌సిపిఎస్‌ఇఏ ఆధ్వర్యంలో వచ్చే నెల సెప్టెంబర్ నుంచి ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేయాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 1న ఉద్యోగులంతా సాముహిక సెలవులతో ఆందోళనకు శ్రీకారం చుట్టి రాష్ట్రం ద్వారా కేంద్రంపై వత్తిడి పెంచాలని టిఎస్‌సిడిఎస్‌ఇఏ నిర్ణయించింది. సాముహిక సెలవుతో ఆందోళనకు శ్రీకారం చుట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించని పక్షంలో నిరవధిక సమ్మెకు దిగడానికి కూడా టిఎస్‌సిపిఎస్‌ఇఏ జాతీయ ప్రధానా కార్యదర్శి స్థితప్రజ్ఞ హెచ్చరించారు.