రాష్ట్రీయం

అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి:సిపిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 27: రాష్ట్రంలో ప్రభుత్వ ఇసుక విధానం, బాక్సైట్ తవ్వకాల అంశాలపై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేసారు. ఈమేర ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బహిరంగ లేఖ రాసారు. ఇసుక విధానంపై శే్వతపత్రం విడుదల చేయటంతోపాటు ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కాల్‌సెంటర్ పెడతామని చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. 2వేల కోట్ల రూపాయల మేర ఇసుక మాఫియా చేతుల్లోకి వెళ్లిందంటూ మీడియాలో విభిన్న కథనాలు వచ్చాయని, ఈ మాఫియాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కొందరు ఎంపి, ఎమ్మెల్యేల ప్రమేయం ఉందనేది బహిర్గమైందని రామకృష్ణ అన్నారు. విశాఖ మన్యం ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దుచేయాలని, మీరు ప్రతిపక్షంలో వుండగా గవర్నర్‌కు లేఖ అందించిన విషయాన్ని మరిచిపోయారా అంటూ ఎద్దేవా చేసారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బాక్సైట్ తవ్వకాల కోసం జీవో 97 విడుదల చేయటం సరైంది కాదన్నారు. మన్యం ప్రాంతంలో గిరిజనుల ఉనికికి ప్రమాదకరంగా పరిణమించిన బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలని స్థానిక ప్రజలు, గిరిజనులు చేసిన ఆందోళన ఫలితంగానే జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేసినప్పటికీ ప్రమాదం పొంచి వుందన్నారు.
అసలు గత 19 మాసాల పాలనలో ప్రజా ప్రయోజనకరమైన ఏ ఒక్క అంశంపై కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకపోవటానికి కారణం ఏమిటని రామకృష్ణ ప్రశ్నించారు. చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇలా అఖిలపక్ష సమావేశాలు నిర్వహించకుండా ఏకపక్ష నిర్ణయాలు చేసిన ఘటనలు లేవన్నారు. ప్రస్తుత సమస్యలైన ఇసుక విధానం, బాక్సైట్ తవ్వకాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్ చేసారు.