తెలంగాణ

సంకల్ప సభ సక్సెస్,,

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలనే డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బిజెపి ఆదివారం నిజామాబాద్‌లో నిర్వహించిన సంకల్ప యాత్రకు ప్రజల నుండి ఆశించిన స్థాయిలోనే ఆదరణ లభించినప్పటికీ, ఆ పార్టీ నాయకుల్లో ఈ సభ ఒకింత అసంతృప్తినే మిగిల్చినట్లయ్యింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ముఖ్య అతిథిగా సభకు ఆహ్వానించగా, ఆయన తన ప్రసంగంలో ఎక్కడ కూడా తెరాస ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టకపోవడం, కనీసం ఆ పార్టీ పేరును కూడా ప్రస్తావించకపోవడం బిజెపి రాష్ట్ర నేతలను నిరుత్సాహపర్చింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కూడా రాజ్‌నాథ్‌సింగ్ సూచించకపోవడం గమనార్హం. నిజాం నిరంకుశ పాలనను తెలంగాణ చరిత్రలో చీకటి అధ్యాయంగా అభివర్ణించడంతోనే సరిపెట్టుకున్నారు. దీంతో సంకల్ప సభ లక్ష్యం నీరుగారినట్లయిందని పలువురు పార్టీ శ్రేణులు చర్చించుకోవడం కనిపించింది.
నిజానికి రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగానికి ముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం మొదలుకుని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, బండారు దత్తాత్రేయ, డాక్టర్ లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి తదితరులంతా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. ఓట్ల రాజకీయం కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎంఐఎంకు తాకట్టు పెట్టిన కెసిఆర్, మరో నిజాంను తలపించేలా కుటుంబ పాలన సాగిస్తున్నారని నేతలంతా దుయ్యబట్టారు. పనిలో పనిగా రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పైనా విరుచుకుపడ్డారు.
విమోచన దినోత్సవం పేరుతో మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ నాయిని చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ, అతనిని మంత్రివర్గం నుండి డిస్మిస్ చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు.
బిజెపిలో ముఖ్య నేతగా చెలామణి అవుతున్న జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఒక అడుగు ముందుకేసి, తెరాసకు మహా ప్రస్థానం (నిష్క్రమణపర్వం) ప్రారంభమైందని, విమోచన దినోత్సవాన్ని ఆ పార్టీ అధికారికంగా నిర్వహించని పక్షంలో 2019లో బిజెపి రాష్ట్రంలోనూ అధికారం చేపట్టి గోల్కొండ కోటపై విమోచన దినం సందర్భంగా మువ్వనె్నల జెండాను ఎగురవేస్తుందని పేర్కొన్నారు. దీనికి ఎంఐఎం నేతలు అడ్డుపడితే వారిని చర్లపల్లి జైలులో నిర్బంధించి మరీ విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని శాసన సభాపక్ష నేత కిషన్‌రెడ్డి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఇలా జాతీయ నాయకులతో పాటు రాష్ట్ర స్థాయి నేతలంతా తెరాసను టార్గెట్‌గా చేసుకుని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బలం గా తమ వాణిని వినిపించగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాత్రం తన ప్రసంగంలో ఈ విషయానికి అసలేమాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడం కమలనాథులను నిరుత్సాహానికి గురిచేసింది. రాజ్‌నాథ్‌ను అభినవ సర్దార్ వల్లాభాయ్‌పటేల్‌తో పోలు స్తూ, కనీసం ఆయన పర్యటనతోనైనా తెరాసకు కనువిప్పు కలిగి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుందని ఆశిస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడితో పాటు నేతలంతా పేర్కొనడం జరిగింది. అందుకు భిన్నంగా రాజ్‌నాథ్‌సింగ్ మోదీ ప్రభుత్వ విజయాలను ఏకరువు పెడుతూ, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలను ప్రస్తావించడానికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం స్థానిక బిజెపి నేతల్లో చర్చకు తావు కల్పించింది. కేంద్ర హోంశాఖ మంత్రి హోదాలో కొనసాగుతుండడం వల్లే రాజ్‌నాథ్‌సింగ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించకుండా సంయమనం పాటించారంటూ సభ ముగిసిన అనంతరం బిజెపి రాష్ట్ర నాయకులు తమ అసంతృప్తిని లోలోపల అణిచివేసుకునే ప్రయత్నాల్లో పడ్డారు.

చిత్రం..నిజామాబాద్‌లో నిర్వహించిన బిజెపి సంకల్ప సభలో ప్రసంగిస్తున్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్