తెలంగాణ

దసరాకు ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: దసరా పండగ సందర్భంగా ప్రయాణీకుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనుంది. హైదరాబాద్-విశాఖపట్నం మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. ఈనెల 28,30 తేదీల్లో సా.గం. 6.50లకు ఈ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉ.గం. 8:00లకు విశాఖపట్నం చేరుకుంటుంది. అలాగే ఈనెల 29, అక్టోబర్ 1 తేదీల్లో రా.గం. 7:20లకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉ.గం. 8.50లకు హైదరాబాద్ చేరుకుంటుంది. అదేవిధంగా హైదరాబాద్-కాకినాడ పోర్టుకు మరో నాలుగు ప్రత్యేక రైళ్లు నడుపన్నుట్టు సిపిఆర్వో తెలిపారు. హైదరాబాద్ నుంచి కాకినాడ పోర్టుకు వెళ్లే ప్రత్యే రైలు ఈనెల 27, 29 తేదీల్లో హైదరాబాద్ నుంచి .గం. 6.50లకు బయలుదేరి మరుసటి రోజు ఉ.గం. 5.35లకు చేరుకుంటుంది. కాకినాడలో ఈనెల 28, అక్టోబర్ 2వ తేదీల్లో సా.గం. 5.35లకు బయలుదేరి మరుసటి రోజు ఉ.గం. 5.10లకు చేరుకుంటుంది. అలాగే హైదరాబాద్ నుంచి రాత్రి గం. 11.40లకు బయలుదేరి మరుసటి రోజు ఉ.గం. 11.45లకు కాకినాడ చేరుకుంటుందని సిపిఆర్‌వో ఉమాశంకర్ కుమార్ పేర్కొన్నారు.