రాష్ట్రీయం

లడాయి మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ శ్రీశైలం, సెప్టెంబర్ 19: శ్రీశైలం నీటిపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య లడాయి మొదలైంది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 100 టిఎంసికి చేరుకోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేట్లు తెరిచి పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటి విడుదల ప్రారంభించింది. కాని దిగువకు కేవలం ఐదు వేల క్యూసెక్కులు కూడా విడుదల చేయడం లేదని, దీనివల్ల తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కృష్ణా బోర్డుకు తాజాగా లేఖ రాసింది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 860.20 అడుగులకు చేరుకుంది. పూర్తిస్తాయి నీటినిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 106.41 టిఎంసిల నీరు నిల్వ ఉంది. జూరాల నుంచి 1,26,528 క్యూసెక్కులు, రోజా నుంచి 4,479 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,31,007 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోంది. జలాశయం నుండి దిగువకు సుమారు 5 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు నుంచి సాగు, తాగునీరు విడుదల చేస్తున్నారు.
ఊహించని విధంగా ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో శ్రీశైలం పంట పండింది. కాగా శ్రీశైలం నీటి మట్టం 854 అడుగుల వద్ద రాయలసీమకు పోతిరెడ్డి పాడుకు నీటిని విడుదల చేయాలనే జీవో ఉంది. జీవో ప్రకారం ఆంధ్ర ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. కాగా నాగార్జునసాగర్‌లో 116 టిఎంసి నీటి నిల్వ, నీటి మట్టం డెడ్‌స్టోరేజీ 500.9 అడుగులకు పడిపోయింది. ఇప్పటికే 17.25 టిఎంసి నీటిని శ్రీశైలం నుంచి విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు పలుసార్లు లేఖ రాసింది. తాజాగా శ్రీశైలంలో నీటి నిల్వ 100 టిఎంసికి చేరడం, నీటి మట్టం 859 అడుగులకు రావడంతో తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుపై వత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు ఈవారంలో హైదరాబాద్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు మంచినీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని కేంద్రం, కృష్ణాబోర్డుకు పలుసార్లు తెలంగాణ లేఖ రాసిన విషయం విదితమే.