రాష్ట్రీయం

వెంకన్న లడ్డూకు లైసెన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, సెప్టెంబర్ 19: తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది, శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూకు జాతీయ ఫుడ్ సేఫ్టీ నుంచి లైసెన్స్ లభించింది. ఈనేపథ్యంలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టిటిడి అధికారులు, సిబ్బంది, కొంతమంది భక్తులు లైసెన్స్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తుంటే, శ్రీవారి ప్రసాదానికి లైసెన్స్‌లు ఏమిటంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఇది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 2016లో బెంగళూరుకు చెందిన నరసింహమూర్తి అనే భక్తుడు న్యూఢిల్లీలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ ఆఫ్ అథారిటీ ఇండియాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో తిరుమల ఆలయంలో తయారుచేసే లడ్డూల నాణ్యతపై పలు అనుమానాలను లేవనెత్తాడు. లడ్డూ తయారీలో వినియోగించే ముడిసరుకులు మేలు రకమైనవి కావని, తయారీ ప్రక్రియలో పోటు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇనుప ముక్కలు, బోల్ట్‌లు, ఉప్పు, బొద్దింకలు బయటపడటం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని ఫిర్యాదు చేశాడు. ఈ పరిస్థితుల్లో శ్రీవారి పోటులో తయారవుతున్న లడ్డూల తయారీని పరిశీలించాలని కోరాడు. దీంతో 2016లో శ్రీవారి లడ్డూ తయారీ విధానంపై సమగ్ర పరిశీలన చేసి లైసెన్స్ మంజూరు చేసేందుకు తిరుమలకు వచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులను టిటిడి వెనక్కి పంపింది. లడ్డూ ప్రసాదానికి ఫుడ్ సేఫ్టీ అనుమతులు అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే టిటిడి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా, 2017 ఆగస్టు 7న ఫుడ్ సేఫ్టీ టిటిడికి లైసెన్స్ మంజూరు చేసింది. అయితే ఇందులో కొన్ని నిబంధనలు విధించింది. దీని ప్రకారం టిటిడికి ఈ లైసెన్స్ ఏడాది కాలానికే వర్తిస్తుంది. తరువాత లైసెన్స్‌ను టిటిడి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీవారి లడ్డూల తయారీకి ఒక్క రోజుకు 45 మెట్రిక్ టన్నుల ముడిసరుకులను వినియోగించుకోవచ్చు. 20 మెట్రిక్ టన్నులతో ఇతర ప్రసాదాలను తయారు చేసుకోవచ్చని పేర్కొంది.