రాష్ట్రీయం

మద్యం బోణీ 300 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: మద్యం దుకాణాలకు రికార్డు స్థాయిలో గడువు ముగిసేసరికి సుమారు 30 వేల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా రూ.250 కోట్ల మేరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచన వేయగా అంచనాలకు మించి రూ.300 కోట్ల ఆదాయం రావడం విశేషం. వచ్చే నెల అక్టోబర్ ఒకటి నుంచి అమలులోకి రానున్న కొత్త మద్యం పాలసీ మేరకు రాష్టవ్య్రాప్తంగా 2216 మద్యం దుకాణాలకు ఈ నెల 13 నుంచి దరఖాస్తులు స్వీకరించగా మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు గడువు ముగిసింది. గడువు ముగిసే సరికి 31 జిల్లాల నుంచి సుమారు 30 వేల దరఖాస్తులు అందినట్టు రాష్ట్ర ఎక్సైజు కమిషనర్ కార్యాలయానికి సమాచారం అందింది. అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా (మూడు కొత్త జిల్లాలు కలిపి) 276 దుకాణాలకుగాను ఏడు వేల దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 412 మద్యం దుకాణాలకుగాను 4 వేల దరఖాస్తులు వచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అత్యల్పంగా హైదరాబాద్‌లో 176 మద్యం దుకాణాలకుగాను 176 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. నల్లగొండ జిల్లా తర్వాత అత్యధికంగా దరఖాస్తులు వచ్చిన జిల్లాల్లో ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల పరిధిలోని దుకాణాలకు వచ్చాయి. కొత్త మద్యం విధానం ప్రకారం రెండు సంవత్సరాల కాలపరిమితితో లైసెన్స్‌లు జారీ చేస్తారు. జనాభా ప్రాతిపదికన 50 వేలు, ఐదు లక్షలు, 20 లక్షలు, 20 లక్షలకు పైగా జనాభా కలిగిన పట్టణాలు, నగరాలకు వేర్వేరుగా నాలుగు శ్లాబులలో లైసెన్స్ ఫీజులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరుతో ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్‌లకు కాలపరిమితి ముగిసింది. అక్టోబర్ ఒకటి నుంచి అమలులోకి రానున్న కొత్త విధానం మేరకు రాష్టవ్య్రాప్తంగా 2,216 మద్యం దుకాణాలకు ఈ నెల 13 నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే నిన్న మొన్నటి వరకు సగం దుకాణాలకు కూడా దరఖాస్తులు అందలేదు. దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు మంగళవారం సాయంత్రానికి దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి. సాయంత్రం ఐదు గంటలకు గడువుముగియడంతో అప్పటి వరకు క్యూలో నిలిచి ఉన్న వారి నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరించడానికి అనుమతించారు. దీంతో చాలా జిల్లాల్లో క్యూలో నిలిచిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి లాటరీ పద్ధతిలో ఎంపిక చేసే ప్రక్రియ అర్దరాత్రి వరకు కొనసాగింది. ఒక్కో దుకాణానికి ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు రుసుం లక్ష రూపాయాలకు డిడి అందజేయాలి. ఇలా వచ్చిన దరఖాస్తులు మొత్తం 30 వేలకు చేరుకోవడంతో వీటి ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 300 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు.

చిత్రం..గడువు ముగింపు రోజున ఉమ్మడి నల్లగొండలో బారులు తీరిన దరఖాస్తుదారులు