రాష్ట్రీయం

తీరు మారకుంటే సొంత పార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 19: దేశంలోని బిసిలను అణచివేయాలని చూసినా, అన్యాయం చేయాలనుకున్నా మరో విప్లవం పుడుతుందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. మంగళవారం తిరుపతిలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశ తీర్మానాలను ఆర్.కృష్ణయ్య మీడియా సమావేశంలో వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు రాజకీయ పార్టీలు బిసిలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ రాజ్యాధికారాన్ని అనుభవించాయన్నారు. ఆంగ్లో ఇండియన్‌లను ఎంపిలుగా, ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పిస్తూ బిసిలకు మాత్రం ఆ అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. బిసిలకు ప్రాధాన్యత ఇవ్వని పార్టీలను బిసి వ్యతిరేక పార్టీలుగా గుర్తించడమే కాకుండా వారి అపజయానికి కారణమవుతామన్నారు. ఇప్పటికైనా పార్టీలు తమ తీరు మార్చుకోవాలన్నారు. బిసిల జనాభా ప్రాతిపదికన అన్ని పార్టీలు సీట్లు కేటాయించాలని లేకుంటే వారి భరతం పడతామని ఆయన హెచ్చరించారు. బిసిల కోసం ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీ పెట్టాలన్న అంశంపై ప్రధానంగా చర్చ జరిగిందని వెల్లడించారు.