రాష్ట్రీయం

ప్రచారానికి హేమాహేమీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 19: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న ప్రధాన కార్మిక సంఘాలు తమ పార్టీలను ప్రచార రంగంలోకి దింపాయి. తమ అనుబంధ కార్మిక సంఘాలను గెలిపించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. సింగరేణి ఎన్నికల్లో రాష్టస్థ్రాయి నేతలు ప్రచారం చేయడం ఆనవాయితీ అయినప్పటికీ వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆరు జిల్లాల పరిధిలో ఉన్న సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉండటం ద్వారా 12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తమ బలాన్ని పెంచుకోవొచ్చని అన్ని పక్షాలు భావిస్తున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా మీటింగ్‌లు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సిపిఐ అనుబంధ ఏఐటియుసి(సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్) గెలుపు కోసం ఆ పార్టీ నాయకులు చాడ వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావుతో పాటు వారికి మద్దతిస్తున్న టిఎన్‌టియుసి ప్రతినిధులుగా రేవంత్‌రెడ్డి, రమణ, ఐఎన్‌టియుసి ప్రతినిధులుగా సంజీవరెడ్డి, వి హన్మంతరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్కలు ప్రచారం చేయనున్నారు. కార్మికుల సంఖ్య అధికంగా ఉన్న శ్రీరాంపూర్, కొత్తగూడెం, మందమర్రి, గోదావరి ఖని, భూపాలపల్లి ఏరియాల్లో ఇప్పటికే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరపున నిజామాబాద్ ఎంపి కవితతో పాటు రాష్టమ్రంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, జోగు రామన్న, ఈటెల రాజేందర్, చందూలాల్ ప్రచారం చేస్తూనే ఉన్నారు. వారసత్వ ఉద్యోగాలు, అందరికీ ఇళ్లు అంశాలపైనే ప్రచారం జరుగుతోంది. సిఐటియుకు మద్దతుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నాయకులు పోతినేని సుదర్శనరావు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం గుర్తింపు సంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి జాతీయ వేతన కమిటీ సభ్యత్వం లేదని, హక్కుల సాధనకు అవకాశం లేదని, జాతీయ సంఘాలనే ఎన్నుకోవాలని విస్తృతంగా ప్రచారం జరుగుతుండగా.. అధికార పార్టీ నేతలు మాత్రం తమ నేత ముఖ్యమంత్రి కెసిఆర్‌కు చెప్పి ఏదైనా సాధిస్తామని కార్మికులను మెప్పించే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. బిఎంఎస్‌కు మద్దతుగా బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నప్పటికీ అది నామమాత్రంగానే ఉంది. కాగా గతంలో ప్రత్యర్థులుగా ఉన్న ఐఎన్‌టియుసి, ఏఐటియుసిలు జట్టు కట్టడం, వీరికి టిడిపి అనుబంధ టిఎన్‌టియుసి మద్దతివ్వడం కార్మికవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోంది.