రాష్ట్రీయం

ఒక్కో కార్మికుడికి రూ. 82వేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: సింగరేణి బొగ్గు గని సంస్థలో పని చేస్తున్న కార్మికులు ఒక్కొక్కరికి రూ.25 వేలు దసరా అడ్వాన్స్, రూ.57 వేలు దీపావళి బోనస్ చెల్లించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ మేరకు రూ.456 కోట్లు ఖర్చు చేసేందుకు సింగరేణి సంస్థ నిర్ణయించింది. గతంలో రూ.54 వేలు ఉన్న బోనస్‌ను రూ.57 వేలకు, రూ.18 వేలు ఉన్న పండుగ అడ్వాన్స్‌ను రూ.25 వేలకు పెంచాలని గతంలోనే సిఎం ఆదేశించిన మేరకు పెంచిన మొత్తం చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ సంస్థ సిఎండి ఎన్.శ్రీధర్ చెప్పారు. ఈ మొత్తాన్ని కార్మికుల బ్యాంకు ఖాతాల్లో దసరా పండుగకు ముందే ఈ నెల 22న జమ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అందిస్తున్న ఈ మొత్తాన్ని పొదుపుగా వినియోగించుకుని, అవసరాలకు తగిన విధంగా వినియోగించుకోవాలని శ్రీధర్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కార్మికులందరికి దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.