రాష్ట్రీయం

బాలికలపై బ్రోకర్ పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: హైదరాబాద్ పాతబస్తీలో గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతోన్న కాంట్రాక్ట్ పెళ్లిళ్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. పెళ్లిళ్ల పేరుతో అరబ్బు షేక్‌లకు అమాయక మైనర్‌లను ఎరవేసి వారి జీవితాలతో చెలగాటమాడుతున్న బ్రోకర్లతోపాటు ఎనిమిది మంది అర బ్బు షేక్‌లను, నలుగురు ముస్లిం పెద్దలను, ముగ్గురు లాడ్జి యజమానులను పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలికలను పెళ్లికి ఒప్పిస్తూ, వివాహాలు జరిపిస్తున్న ఓ ఖాజీతోపాటు మరికొందరు మధ్యవర్తులను దక్షిణ మండల పోలీసులు అరెస్టు చేశారు. మైనర్లను పెళ్లి చేసుకుని విదేశాలకు తీసుకెళ్లి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్టు వచ్చిన అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సోమవారం నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి మీడియాకు వెల్లడించిన వివరాలిలావున్నాయి. పాతబస్తీలోని ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్టలో కొందరు అరబ్ షేక్‌లు అమాయక బాలికలను కాంట్రాక్ట్ పద్ధతిలో వివాహం చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. నలుగురు ముస్లింలను అదుపులోకి తీసుకుని విచారించగా అనేక వాస్తవాలు బయటపడ్డాయ. సౌదీ అరేబియా, ఒమాన్, ఖతర్ నుంచి వచ్చే అరబ్బు షేక్‌లకు హైదరాబాద్‌లోని లాడ్జిలలో బ్రోకర్లు బస ఏర్పాటు చేస్తున్నారు. పేద ముస్లింలను గుర్తించి వారికి కావలసిన డబ్బులు
అందజేస్తూ వారి పిల్లలను కాంట్రాక్ట్ పెళ్లిలకు ఒప్పిస్తున్నారు. బుధవారం ఇద్దరు అరబ్‌షేక్‌లకు పెళ్లి కుదిర్చినట్టు సమాచారం అందింది. దీంతో దక్షిణ మండల పోలీసులు అప్రమత్తమై బ్రోకర్లను, లాడ్జి యజమానులను, పెళ్లి చేసే ఖాజీని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరికి ముంబయిలోని ముఖ్య ఖాజీ ఫరీద్ అహ్మద్ ఖాన్, పెళ్లి జరిగినట్టు మ్యారేజీ సర్ట్ఫికెట్లు, వీసావంటి వాటిని సమకూర్చి లక్షలాది రూపాయలు దండుకుంటున్నాడు. కాంట్రాక్టు విధానంలో అక్రమంగా పెళ్లిళ్లు చేస్తున్న వారిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో అల్ మయాహి హబీబ్ అలీ ఇసా, అల్ షాహి తాలిబ్ హమీద్, అల్ ఉబ్నై జుమా సులేమాన్, అల్ సాలె నసీర్ ఖలీఫా హమీద్, ఖాసీం హసన్ ఉన్నారు. వీరంతా సౌదీ అరేబియా, ఒమన్, ఖతర్ దేశాలకు చెందిన వారుకాగా, ఫరీద్ అహ్మద్ ఖాన్ ముంబయికి చెందిన వాడు. హైదరాబాద్ కేంద్రంగా బాలికలను పెళ్లిళ్ల పేరిట అరబ్బు షేక్‌లకు కాంట్రాక్ట్ పద్ధతిలో అంటగడుతున్నట్టు పోలీస్ దర్యాప్తులో తేలింది. పెళ్లిళ్లు చేసుకున్న అరబ్ షేక్‌లు వారి దేశాలకు తీసుకెళ్లి కొంతకాలం తరువాత వ్యభిచార రొంపిలోకి దించుతున్నారని, వీరిపట్ల అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి సూచించారు. ఇళ్లల్లో పని కల్పిస్తామని, ఉద్యోగాలు ఇస్తామని విదేశాలకు పంపే ఏజెంట్ల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ నిబంధనల మేరకు ఖాజీలు పెళ్లిళ్లు జరపాలని, మైనార్టీ తీరకుండానే పెళ్లిళ్లు చేయవద్దని కమిషనర్ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు.