రాష్ట్రీయం

చోటా మోదీ.. కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, సెప్టెంబర్ 20: దేశాన్ని పాలిస్తున్న నరేంద్రమోదీని రాష్ట్రాన్ని పాలిస్తున్న చోటా మోదీ (కెసిఆర్) అనుసరిస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, ఏఐసిసి కార్యదర్శి రామచంద్ర కుంతియా విమర్శించారు. బుధవారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఇందిరమ్మ రైతు సభ వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన భూములపై కెసిఆర్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పేర, ఎయిర్‌పోర్ట్ నిర్మాణాల పేర, పరిశ్రమల ఏర్పాటు పేర అధికారం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గొప్పలు చెప్పుకునేందుకే భూప్రక్షాళన, సర్వే పనులను కెసిఆర్ చేపడుతున్నారని విమర్శించారు. సోనియా నేతృత్వంలో వైఎస్‌ఆర్ సిఎంగా ఉన్నపుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భూములిచ్చారని గుర్తుచేశారు. గత మూడేళ్లుగా విద్యార్థులకు స్కాలర్‌షిప్స్, ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇవ్వలేదని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేదని విమర్శించారు. సిఎం కెసిఆర్ హైదరాబాద్- ఢిల్లీల మధ్య తిరగడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని, సెక్రటరియేట్ భవన నిర్మాణంపై ఉన్న దృష్టి ప్రజల బాగోగులపై లేదని పేర్కొన్నారు. బూత్ కమిటీలు బలంగా ఉంటేనే రాష్ట్రంలో పార్టీ బలోపేతమవుతుందని, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారానికి బూత్ కమిటీలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. కాంగ్రెస్ బూత్ కమిటీలు రైతుల సమస్యలు తెలుసుకుని మండల కమిటీల ద్వారా జిల్లా కమిటీలకు తెలియపర్చాలని, రైతు సమస్యలపై రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని నిలదీస్తుందన్నారు. బూత్ కమిటీల పనితీరు పరిశీలించి రాహుల్‌గాంధీ 2019 ఎన్నికల అభ్యర్థులను గుర్తిస్తారన్నారు. లక్షలాదిగా ఉన్న బూత్ కమిటీ సభ్యులు పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మోదీ పాలనలో జిఎస్‌టి కారణంగా సగటు మనిషి ఆదాయం పడిపోయిందని, నోట్ల రద్దు విషయంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన కెసిఆర్ మరుసటిరోజే మాట మార్చారని ఎద్దేవా చేశారు. మోదీ, కెసిఆర్ ఇద్దరూ అబద్దాలకు ఆనవాళ్లన్నారు. శాసనసభా పక్షనేత కె.జానారెడ్డి మాట్లాడుతూ రైతుల ఇబ్బందులు తొలగిస్తున్నట్లు భూ ప్రక్షాళన, నవీకరణ, శుద్దీకరణ పేర ప్రభుత్వం నటిస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వాలు చేయలేపని తమ ప్రభుత్వం చేస్తోందని గొప్పలు చెప్పడానికే భూసర్వే అని ఆరోపించారు. భూ సర్వేలో అవకతవకలు జరిగినా, అన్యాయం జరిగినా వెంటనే స్పందించేందుకు అప్రమత్తంగా ఉండాలనే సదస్సులు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఐక్యత, సమన్వయంతో ప్రజల అభిమానాన్ని కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని వివరించారు.