రాష్ట్రీయం

ట్రాక్ రెడీ అయ్యంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: తెలంగాణ రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ట్రాక్) కదిలింది. రాష్ట్రంలో 31 జిల్లాలను అనుసంధానిస్త్తూ 5107 కి.మీ రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ.20 వేల కోట్ల ఖర్చు అవుతుందని రోడ్లు, భవనాల శాఖ అంచనాలు సిద్ధం చేసింది. ఈ అంచనాలపై సిద్ధం చేసిన నివేదికను వారంలో ముఖ్యమంత్రికి అందచేయనున్నట్టు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈమేరకు కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధమైనట్టు వెల్లడించారు. సిఎంనుంచి అనుమతి వచ్చిన వెంటనే రోడ్ల నిర్మాణంపై డిపిఆర్‌ను తయారు చేసి సర్వే చేయించి నిధుల సమీకరణకు కసరత్తు ప్రారంభమవుతుంది. మెగా ప్రాజెక్టులో నాలుగు దశలున్నాయి. ఇందులో తొలిదశ గోల్డెన్ గార్లెండ్. దీనికింద 1534 కి.మీ రోడ్డు నిర్మిస్తారు. రెండవ దశ లో బంగారు వలయం కింద 886 కి.మీ రోడ్డును నిర్మిస్తారు. తూర్పు- పశ్చిమ కారిడార్ కింద 511 కి.మీ, ఉత్తర- దక్షిణ కారిడార్ కింద 558 కి.మీ రోడ్డును నిర్మిస్తారు. హైదరాబాద్ నుంచి గోల్డెన్ గార్లెండ్ వరకు 1618 కి.మీ రేడియల్ రోడ్డును నిర్మించాలన్నది అంచనాల్లో పొందుపర్చారు. రాష్ట్రంలో 46 శాతం పారిశ్రామిక బెల్ట్‌ను, 48 శాతం పర్యాటక సెంటర్లు, 48 శాతం వ్యవసాయ మార్కెట్లు, 32 శాతం జనాభాను ప్రతిపాదిత రోడ్లు కవర్ చేస్తాయి. 31 జిల్లాల్లో 425 మండలాలను కొత్త రోడ్లు కవర్ చేస్తాయి. ట్రాక్ ఆధ్వర్యంలో జరిగే కొత్త రోడ్ల నిర్మాణం వల్ల పర్యాటక, పారిశ్రామిక రంగాలకు మహర్దశ పట్టనుంది.