తెలంగాణ

తీరుగా సాగని తిరుగు ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జనవరి 17: సంక్రాంతి పండగ ముగిసింది. పల్లెలకు వెళ్లిన హైదరాబాద్ వాసులు తిరుగుముఖం పట్టడంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి కిక్కిరిసిపోయిం ది. ఇసుకేస్తే రాలనంతగా రహదారిని వాహనాలు పూర్తిగా ఆక్రమించడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లతో ప్రయాణికులు అవస్థ పడ్డారు. టోల్‌గేట్ల వద్ద పరిస్థితి సరేసరి.
నందిగామ, కోదాడ, సూర్యాపేట, నార్కెట్‌పల్లి, చిట్యాల,పంతంగి టోల్‌ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తిరుగు ప్రయాణికులకోసం ఆర్టీసీ అదనంగా ఏర్పాటు చేసిన బస్సులు ఏమాత్రం సరిపోలేదు సరికదా నాసిరకం బస్సుల్లో జనాన్ని ఎక్కించి, ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
కొర్లపహాడ్ కిటకిట
కేతేపల్లి: నల్గొండ జిల్లా కొర్లపహాడ్ శివారులోని టోల్‌ప్లాజా వద్ద సాధారణంగా 5నిమిషాలకు మించి ఆగని వాహనాలు ఆదివారం గంటలకొద్దీ నిలిచిపోయాయి. ఉదయం నుంచే వాహనాల రద్దీ అధికంగా ఉన్నా సాయంత్రం నాలుగు గంటల తర్వాత తీవ్రమైంది. దీంతో టోల్‌ప్లాజా వద్ద అరకిలోమీటర్ పొడవునా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. టోల్‌ప్లాజాలో మొత్తం 12 కౌంటర్‌లు ఉండగా తొమ్మిది కౌంటర్‌లను ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్లే వాహనాలకు కేటాయించినా ఫలితం కనిపించలేదు. ఉదయం 10 గంటలకు 1200 వాహనాలు వెళ్లగా సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య నాలుగు వేలు, ఐదు నుంచి ఆరు గంటల మధ్యన ఐదు వేల వాహనాలు వెళ్లాయి. తెల్లవారే వరకూ ఇదే రద్దీ కొనసాగే అవకాశాలున్నాయి.
బారులు తీరిన వాహనాలు
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిట్యాల పోలీస్‌స్టేషన్ నుండి సుజనాటాకీస్ వరకు దాదాపుఅరకిలోమీటర్ మేరకు వాహనాలు నాలుగు వరసల్లో నిలిచిపోయాయి.

కిటకిటలాడిన
రైల్వే, బస్ స్టేషన్లు

విజయవాడ, జనవరి 17: సంక్రాంతి పర్వదినం అనంతరం స్వస్థలాలకు వచ్చినవారంతా గమ్యస్థానాలకు వెళ్లేందుకు తిరుగు ప్రయాణం కట్టడంతో ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా రాష్ట్ర రాజధాని విజయవాడలోని రైల్వే, బస్టేషన్లు ఇసుక వేస్తే రాలనంతగా కిటకిటలాడిపోయాయి. ఈనెల 19వ తేదీ వరకు కూడా ప్రత్యేక రైళ్లలోని ముందస్తు రిజర్వేషన్ కూడా పూర్తయినప్పటికీ రైల్వేస్టేషన్ పరిసరాల గ్రామాల్లోని ప్రజలు కరెంట్ బుకింగ్‌తో బోగీల్లో వేలాడుతూ ప్రయాణం చేయటం కనిపించింది. పండిట్ నెహ్రూ బస్టేషన్‌లో మాత్రం తొలిసారిగా ఆర్టీసీ ఎండి నండూరి సాంబశివరావు ఆదేశాల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు జరిగాయి. ప్రయాణికులు నిరాశతో వెనుతిరిగి వెళ్లటానికి వీల్లేకుండా క్షణాలపై బస్సులు ఏర్పాటు చేయడం కనిపించింది. విజయవాడ నుంచి ఒక్క హైదరాబాద్‌కే సాధారణ రోజుల్లో 180 షెడ్యూల్స్ ఉండగా పండుగ రద్దీని దృష్టిలో వుంచుకుని 140 ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేయటం జరిగింది. అయితే ఈ బస్సులన్నింటిలో కూడా ముందస్తు రిజర్వేషన్ పూర్తికావటంతో ఈ ఒక్కరోజే 110 బస్సులను కరెంట్ బుకింగ్‌పై హైదరాబాద్‌కు నడిపించారు. విశాఖ, బెంగుళూరు, చెన్నై, ఇతర నగరాలకు కూడా అదనపు బస్సులను ఏర్పాటుచేసారు. తెల్లవారుఝాము వరకైనా బస్సులను నడిపేందుకు సిద్ధంగా వున్నామని రీజనల్ మేనేజర్ పివి రామారావు తెలిపారు.
chitram...
ప్రయాణికులతో కిటకిటలాడుతున్న విజయవాడ ఆర్టీసీ బస్టాండు