రాష్ట్రీయం

నిండు కుండ శ్రీశైలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం/శ్రీశైలం ప్రాజెక్టు, అక్టోబర్ 12: గురువారం ఉదయం శ్రీశైలం జలాశయం నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో ప్రాజెక్టులోని 6,7నంబరు గల స్పిల్‌వే గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావు, అచ్చంపేట శాసన సభ్యుడు గువ్వల బాలరాజు డ్యాం గేట్ల వద్ద పూజలు చేసి గేట్ల ద్వారా నీటిని మంత్రి విడుదల చేశారు.
ఒక్కొక్క గేటు పది అడుగుల మేర ఎత్తి, రెండు గేట్ల ద్వారా 55874క్యూసెక్స్‌ల నీటికి నాగర్జున సాగర్‌కు విడుదల చేశారు. కృష్ణానదికి మహమంగళ హారతి పూజలు చేసి నదిలోకి పూలు, పూజా సామాగ్రిని వేశారు. ఏపి మంత్రి మాట్లాడుతూ నెల రోజుల క్రితం 20టిఎంసిలు మాత్రమే ఉన్న శ్రీశైలం రిజర్వాయర్ ఈ రోజు 215టి ఎంసిలకు చేరుకొని, ఇంకా ఎగువ ప్రాంతం నుండి వరద నీరు రావడంతో దిగువన నాగర్జునసాగర్ కూడా పూర్తి స్థాయికి చేరుకుంటుందని ఆశా భావం వ్యక్తం చేశారు. సమృద్ధిగా కృష్ణానదికి నీరు వచ్చే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తాగునీరు, సాగునీరుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, రాష్ట్రాల మధ్య జలజగడాలు ఉండవని ఆయన అన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నీటి వాటాను ఇవ్వటంలో ఇబ్బందులు సృష్టించవద్దని, తమను కృష్ణా నది నుండి మంచి సరఫరా చాలా ముఖ్యం అని బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తమకు కేటాయించిన నీటిని తమకు పొందే హక్కు ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్, మల్లికార్జునరెడ్డి, ఇరు రాష్ట్రా ఇరిగేషన్ అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
సాయంత్రానికి రిజర్వాయర్ నీటి మట్టం: గురువారం సాయంత్రం ఆరు గంటలకు నీటి మట్టం 885అడుగులకు గాను 884.70అడుగులుగా, గరిష్ట నీటి నిల్వ 215.8 టిఎంసిలకు గాను 213.88టి ఎంసిలుగా ఉంది. ఎగువ జూరాల నుండి 68235 క్యూసెక్కులు, రోజా నుండి 26472 క్యూసెక్స్‌లు, హండ్రీ నుండి 2వేల క్యూసెక్కులు, మొత్తం 96707క్యూసెక్కుల నీరు వచ్చి చేరుకుంది. కుడిగట్టు పవర్ హౌజ్‌లో ఒక్కొక్క యూనిట్ 105మెగావాట్ల విద్యుదుత్పత్తి 7జనరేటర్ల ద్వారా 1774క్యూసెక్కుల నీటిని, తెలంగాణ భూగర్భ పవర్ హౌజ్ ద్వారా ఒక్కొక్కటి 150మెగావాట్లతో ఆరు జనరేటర్లు విద్యుదుత్పతి చేస్తూ 42378క్యూసెక్కులనీటిని పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా 11వేల క్యూసెక్కులు, హండ్రీ నీవా ద్వారా 75క్యూసెక్కులు, కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ ద్వారా 2400క్యూసెక్కుల నీరు రెండు గేట్ల ద్వారా కలిపి 144071 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన విషయాన్ని తెలుసుకున్న ప్రజలు వివిధ ప్రాంతాల నుండి వచ్చి అక్కడి అహ్లాదకర వాతావరణం చూసి ఆనందిస్తున్నారు.