రాష్ట్రీయం

ఆరు నూరైనా కాళేశ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 12: కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలను ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పారించి సాగర్ ఆయకట్టు కింద రెండు పంటలు పండించేలా చేస్తానని సిఎం కెసిఆర్ ప్రకటించారు. గురువారం సూర్యాపేట నూతన కలెక్టరేట్ భవన సముదాయానికి శంకుస్థాపన చేసి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు, 400కెవి సబ్ స్టేషన్లకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రం నిర్వహించిన సూర్యాపేట ప్రగతి సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతు కాళేశ్వరం ప్రాజెక్టు కింద యాదాద్రి జిల్లా పరిధిలో బస్వాపురం, గంథమల్ల రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఇక్కడి నుండి నిర్మించే కాలువల సామర్ధ్యం, మూసీ ప్రాజెక్టు సామర్ధ్యాలను పెంచడంతో పాటు కొత్తగా నకిరేకల్ మూసీ ప్రాజెక్టు నుండి 30కిలోమీటర్ల కాలువను నిర్మించి పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌ను నింపి సాగర్ ఆయకట్టులోని మూడు లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీళ్లందిస్తామన్నారు. లక్షమంది ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు అడ్డం పడినా ఆరునూరైనా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తీరి ఫ్లోరైడ్, కరవు పీడిత ఉమ్మడి నల్లగొండ జిల్లా కరవును శాశ్వతంగా పారదోలుతామన్నారు. ఏలేశ్వరం వద్ధ నందికొండ పేరుతో నిర్మించాల్సిన నాగార్జున సాగర్ ప్రాజెక్టును 19కిలోమీటర్లకు దిగువకు తరలించి నిర్మించడం ద్వారా
నల్లగొండకు ఆనాడే ఆంధ్రపాలకులు మోసం చేశారన్నారు. పులిచింతల ప్రాజెక్టు కడుతుంటే ఆనాడు మేం వ్యతిరేకించి అడ్డుకుంటే నల్లగొండ కాంగ్రెస్ నేతలు డ్రామాలు చేశారన్నారు. కాళేశ్వరం నిర్వాసితులకు తమ ప్రభుత్వం అందిస్తున్న పరిహారంపై విమర్శలు చేస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన నియోజకవర్గంలోని పులిచింతల నిర్వాసితులకు ఎంత పరిహారం ఇప్పించారో ఆత్మ విమర్శ చేసుకోవాలని ఏ ముఖం పెట్టి మాపై విమర్శలు చేస్తున్నారంటూ కెసిఆర్ నిలదీశారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు అన్యాయం చేసేలా వైఎస్సార్ 65వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా పొతిరెడ్డిపాడు తవ్వితే ఆ జిల్లాల కాంగ్రెస్ నేతలు ఆనాడు నోరు మెదపకపోతే తాము అసెంబ్లీలో, బయట పోరాడామన్నారు. మూసీ నుండి పానగల్‌కు కాలువ తవ్వవచ్చన్న ఆలోచన నల్లగొండ కాంగ్రెస్, టిడిపి, ఎర్రజెండా పార్టీలకు ఎప్పుడైనా వచ్చిందా అంటూ కెసిఆర్ ప్రశ్నించారు. జిల్లాలో ఉద్యమకాలంలో తాను పాదయాత్ర చేసినప్పుడు స్థూపాలు తప్ప ప్రాజెక్టులు కనిపించలేదన్నారు. మూసీ-పానగల్ కాలువతో సాగర్ ఆయకట్టు రైతులు రెండు పంటలు మీసం మెలేసి పండించుకోవచ్చన్నారు. ఉద్యమకాలంలో జిల్లాలో సాగించిన పాదయాత్రల ద్వారా ఈ ప్రాంత ప్రజలకు సాగుతాగునీటి కష్టాలు తెలిసిన తాను కష్టపడి తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేసేందుకు తండ్లాతున్నానన్నారు.
తెలంగాణలో ప్రతి జిల్లా ప్రతి ఇంచీ అభివృద్ధికి తాను రక్తంధారపోసైనా ఏ పార్టీ, ఏ జిల్లా అని చూడకుండా తెలంగాణ ప్రజలంతా అభివృద్ధి చెందేందుకు తపిస్తున్నానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టుకు కూడా నీరందనుందన్నారు. సిడిఎఫ్ ఫండ్ ఖర్చులో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటు ఉత్తమ్‌కుమార్ చేసిన విమర్శలు అప్రజాస్వామికమని కేసిఆర్ అన్నారు. సమవర్తిగా, సమన్యాయం చేసే సిఎంగా తెలంగాణ అంతా అభివృద్ధి చేసేందుకు ఉద్యమకాలంలో ప్రజలు తనపై పెట్టుకున్న ఆశలు నేరవేర్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నానన్నారు. వెనుకబడిన పాత నల్లగొండ జిల్లా అభివృద్ధికి వచ్చే బడ్జెట్‌లో నల్లగొండలో ఒకటి, సూర్యాపేటలో మరొకటి రెండు మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాల్లో బీబీనగర్ వద్ధ ఎయిమ్స్‌ను ఏర్పాటు చేస్తామని కొత్త మూడు జిల్లాల్లో మూడు మెడికల్ కళాశాలల ఏర్పాటుతో పాత జిల్లా అభివృద్ధి జరుగనుందన్నారు. ఇప్పటికే పాత నల్లగొండ జిల్లా అభివృద్దికి 24,950కోట్లతో దామరచర్లలో 4వేల మెగావాట్ల ఆల్ట్రా మోడల్ థర్మల్ పవర్ ఫ్లాంట్ నిర్మాణం జరుగుతుందని ఇవన్నీ పూర్తయ్యాక పాత నల్లగొండ జిల్లా ప్రజలు బ్రహ్మాండమైన అభివృద్ధి ఫలాలు అందుకోబోతారన్నారు. గత ఎన్నికల సందర్భంగా సూర్యాపేట సభలో తాను చేసిన ప్రకటన మేరకు సూర్యాపేటను జిల్లాగా, తన మాట మేరకు గెలిపించిన జగదీష్‌రెడ్డిని మంత్రిగా చేశానన్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా అభివృద్ధికి పలు వరాలు, నిధులు ప్రకటించిన సిఎం కెసిఆర్ త్వరలో నల్లగొండ, యాదాద్రి జిల్లాలోనూ, నకిరేకల్, కోదాడల్లోని పర్యటించి నిధులు, వరాలు అందిస్తానన్నారు. జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్, ఎంపిలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, వేముల వీరేశం, గాదరి కిషోర్, భాస్కర్‌రావు, రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, పూల రవిందర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సూర్యాపేట ప్రగతి సభలో అభివాదం చేస్తున్న సీఎం కెసిఆర్, హాజరైన ప్రజలు