రాష్ట్రీయం

ఇక హైస్పీడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మరింత వేగం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాలువల తవ్వకం వల్ల భూ సేకరణ, కాలువ నిర్మాణం వల్ల జరిగే జాప్యాన్ని నివారించడానికి పైపుల ద్వారా సాగునీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్యాకేజి 21 కింద కాలువల నిర్మాణానికి బదులుగా పైపుల ద్వారా నీటిని తరలించడానికి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం పరిపాలనా అమోదం తెలుపుతూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లాలో కాలువల నిర్మాణానికి బదులుగా పైపుల ద్వారా సాగునీటిని అందించడానికి రూ.2248 కోట్లకు నీటిపారుదల శాఖ పరిపాలనా అమోదం తెలిపింది. అలాగే ప్యాకేజి 21 కింద ప్రతిపాదించిన కొండమ్ చెరువు, మనిచిప్ప రిజర్వాయర్లలో 3.50 టిఎంసిల నీటి నిలువ కోసం గతంలో చేసిన రూ.533.725 కోట్ల పనులను ప్యాకేజి తొలగించి రూ.375 కోట్లతో తాజాగా చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం అనుమతి మంజురు చేసింది. పైపుల లైన్ల కోసం ప్రతిపాదించిన రూ.2248 కోట్ల వ్యయం నుంచే ఈ నిధులను వినియోగించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో చేసిన ప్రతిపాదనను రద్దు చేయడంతో రిజర్వాయర్ల నిర్మాణానికి తిరిగి తాజాగా టెండర్లు ఆహ్వానించాలని ఉత్తర్వులలో పేర్కొంది. గతంలో చేసిన ప్రతిపాదనలో ఉన్న వాట్ వ్యయానికి బదులుగా తాజాగా జూలై నుంచి అమలులోకి వచ్చిన జిఎస్‌టిని ప్రాజెక్టు అంచనాల్లో చేర్చినట్టు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి పేరిట జారీ అయిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. ప్యాకేజి 7 కింద కరీంనగర్ జిల్లా నంది మేడారం మండలం
ధర్మారం గ్రామం వద్ద 32 టిఎంసిల నీటిని కాకతీయ కాలువలోకి లిఫ్ట్ చేయడానికి రూ.1502 వ్యయానికి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ చేసిన ప్రతిపాదనకు కూడా ప్రభుత్వం అనుమతి మంజురు చేసింది. తాజాగా చేసిన ప్రతిపాదన వల్ల 35 ఎకరాలు, 33 గుంటల భూ సేకరణ చేయాల్సిన అవసరం తప్పింది. భూ సేకరణ సమస్యను అధిగమించడంతో పాటు కాలువల నిర్మాణం వల్ల జరిగే జాప్యాన్ని నివారించేందుకు తీసుకున్న చర్యల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న దాని కంటే ముందుగానే పూర్తయ్యే అవకాశం ఉంటుందని అధికారులు అంచన వేస్తున్నారు.