రాష్ట్రీయం

గ్రామ సభలు అనుమతిస్తేనే మద్యం షాపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతంలో గ్రామ సభల అనుమతి లేకుండా మద్యం షాపులను ఏర్పాటు చేసేందుకు లైసెన్సులను మంజూరు చేయరాదని హైకోర్టు గురువారం రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎం గంగారావుతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. పోడెం రత్నం అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏజన్సీలోన 17 గ్రామాల్లో మద్యం షాపులకు లైసెన్సులను ఇస్తామంటూ రాష్ట్రప్రభుత్వం సెప్టంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనోటిఫికేషన్‌ను చెల్లదంటూ పిటిషనర్ సింగిల్ జడ్జి కోర్టును ఆశ్రయించారు. ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన చట్టాలను అమలు చేసిన తర్వాత లైసెన్సులను మంజూరు చేయాలని ఆదేశించారు. కాని గ్రామసభల నిర్వహణపై ఎటువంటి నోటిఫికేషన్‌ను ఎక్సైజ్ శాఖ జారీ చేయలేదని పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు. తన వాదనలను కొనసాగిస్తూ పంచాయత్స్ ఎక్స్‌టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ రూల్స్ 2011 తప్పనిసరిగా గ్రామసభలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. గ్రామసభలు తమ సమ్మతిని తెలియచేస్తేనే లైసెన్సులను మంజూరు చేయాల్సి ఉందన్నారు. ఈ వాదనలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. అనంతరం గ్రామసభల అనుమతిలేకుండా మద్యం షాపులకు అనుమతి ఇవ్వరాదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.