రాష్ట్రీయం

భద్రాద్రి రామాలయంలో మరో ఆర్జిత సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, అక్టోబర్ 12: దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మరో ఆర్జిత సేవకు శ్రీకారం చుడుతున్నారు. దేవస్థానం ఈవో కె.ప్రభాకర్ శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో ఆలయంలో ‘సంధ్యాహారతి’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేశారు. రామదాసు ఆలయం నిర్మించిన నాటి నుంచి ఈ ఆలయంలో పలు ఆర్జిత సేవలు కొనసాగిస్తున్నారు. ఈ కోవలోనే నూతనంగా ‘సంధ్యాహారతి‘ని ప్రవేశ పెడుతున్నారు. శుక్రవారం చినజీయర్‌స్వామి సంధ్యాహారతి సేవను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రతి శుక్రవారం సాయంత్రం దీన్ని నిర్వహించేందుకు జీయర్‌స్వామి కూడా సమ్మతించడంతో వైదిక కమిటీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 20 తేదీ నుంచి సంధ్యాహారతిని భక్తుల మధ్య నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. అశ్వయుజ బహుళ నవమి పునర్వసు నక్షత్రం సందర్భంగా ఆలయానికి ఉన్న ఉత్తరద్వారంలో స్వామికి ప్రత్యేక పూజలు చేసి సాయం సంధ్యవేళ ఈ హారతి ఇవ్వనున్నారు.

చిత్రం..భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి