రాష్ట్రీయం

సిద్దేశ్వరమే దిక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో అతి తక్కువ రోజుల్లో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు ఫలాలు రాయలసీమకు అందాలంటే కర్నూలు జిల్లాలో కృష్ణానదిపై సిద్దేశ్వరం ఆనకట్ట నిర్మించక తప్పదని సాగునీటి రంగం నిపుణులు పేర్కొంటున్నారు. సిద్దేశ్వరం ఆనకట్ట ఆవశ్యకత గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నతాధికారులు, నిపుణులతో మాట్లాడినట్లు సమాచారం. అయితే ఆనకట్ట నిర్మాణంపై మాత్రం నిర్ణయం తీసుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఆనకట్ట నిర్మాణంపై కోస్తాంధ్ర ప్రాంత అధికారపార్టీ నేతల వత్తిడి, ఆర్థిక ఇబ్బందుల వల్ల సిఎం తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సిద్దేశ్వరం ఆనకట్ట నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వానికి తగిన వివరణ ఇస్తే అక్కడి నుంచి అభ్యంతరం ఉండదని అంటున్నారు.
సిద్దేశ్వరం ఆనకట్ట నిర్మాణంపై రాయలసీమనేతలు సైతం పలుదఫాలు ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇచ్చారు. పట్టిసీమ ఫలాలు రాయలసీమకు అందిస్తానన్న హామీని నెరవేర్చుకోవడం కోసం ముఖ్యమంత్రి అంగీకరిస్తారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గోదావరి, కృష్ణానదుల అనుసంధానం కోసం పట్టిసీమ ప్రాజెక్టును శరవేగంగా నిర్మించింది. దీనివల్ల సుమారు 80 టిఎంసిల కృష్ణాజలాలు ఆదా అవుతాయని వాటిలో 45 టిఎంసిల నీరు రాయలసీమకు అందిస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. అయితే కృష్ణాజలాలను నిల్వ చేసుకోవడానికి అవసరమైన జలాశయాలు లేకపోవడంతో నీటిని సద్వినియోగం చేసుకోవడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త జలాశయాలను నిర్మించాలంటే ఆర్థిక ఇబ్బందులతో పాటు భూ సమస్య కూడా ఇరుకున పెడుతుందంటున్నారు. ఈక్రమంలో కృష్ణానదిపై సిద్దేశ్వరం ఆనకట్టను సముద్రమట్టానికి 854 నుంచి 860 అడుగుల ఎత్తున నిర్మిస్తే సుమారు 50 నుంచి 55 టిఎంసిల నీటిని నిల్వ చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. ఇందుకు అదనంగా ఒక ఎకరా భూమి అవసరం లేదని, అదే సమయంలో తక్కువ ఖర్చుతో పూర్తవుతుందంటున్నారు. అయితే దీనిపై కోస్తాంధ్ర నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అత్యవసర సమయాల్లో తాము ఇబ్బందులు పడతామని సిఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఆయన పూర్తి స్థాయి చర్చ, సమీక్ష అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారని నిపుణుల ద్వారా తెలుస్తోంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి సిద్దేశ్వరం ఆనకట్టపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.