రాష్ట్రీయం

రక్షణ రంగం.. మరింత పటిష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 16: రక్షణ రంగాన్ని మరింత పటిష్టపరచనున్నట్టు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. భారత నౌకాదళంలో కొత్తగా చేరిన ఐఎన్‌ఎస్ కిల్పాన్ యుద్ధ నౌకలను సోమవారం లాంఛనంగా ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్షణ రంగానికి మరిన్ని అధిక నిధులు కేటయిస్తామన్నారు. భారత నౌకాదళం ఒకప్పుడు విదేశాల నుంచి యుద్ధ నౌకలను కొనుగోలు చేసే పరిస్థితి ఉండేదని, మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మేకిన్ ఇండియా పేరిట స్వదేశీ పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మోదీ పిలుపును అందుకుని భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ నౌకలను తయారుచేసే ప్రక్రియను వేగవంతం చేయడం శుభపరిణామమన్నారు. 81 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఐఎన్‌ఎస్ కిల్పాన్‌ను చూసి భారత జాతి గర్వపడుతోందన్నారు. భారత నౌకాదళానికి కావల్సిన మరిన్ని యుద్ధ నౌకలు స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందిస్తున్న విషయాన్ని నిర్మలా సీతారామన్ గర్తు చేశారు. మనదేశంలో అత్యంత పొడవైన తీర్రపాంతాన్ని పరిరక్షించే బాధ్యత నేవీ భుజస్కందాలపై ఉందన్నారు. భారత నావికాదళం సముద్ర జలాల్లోని వనరులను పరిరక్షించుకుంటూ, ఉగ్రమూకలను ఎప్పటికప్పుడు తరిమికొడుతూ, అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ప్రశంసనీయ బాధ్యత నిర్వర్తిస్తుందన్నారు. శాంతి సమయంలో ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతోందని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడంలో నేవీ పాత్ర అమోఘమని నిర్మలా సీతారామన్ అన్నారు. కోల్‌కత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ తయారుచేసిన ఐఎన్‌ఎస్ కిల్పాన్ అంచనాలకు మించి ఉందని సీతారామన్ అన్నారు. ఈ షిప్‌యార్డ్ భారతదేశానికే గర్వకారణమని చెప్పారు. కమోర్తా తరహా యుద్ధ నౌకల్లో ఇది మూడవదని మంత్రి చెప్పారు. ఈ షిప్‌యార్డ్‌లో మరిన్ని స్వదేశీ యుద్ధనౌకలను తయారు చేయాలని మంత్రి ఆకాంక్షించారు. దేశంలోని నౌకా నిర్మాణ కేంద్రాలు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందాలన్నారు. మారుతున్న పరిణామాలకు అనుగుణంగా, అత్యాధునిక ఆయుధాలను మోసుకు వెళ్లగలిగే నాణ్యమైన నౌకల నిర్మాణం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
భారత నౌకాదళ ప్రధానాధికారి సునీల్ లాంబ మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించడంలో విజయం సాధించామన్నారు. శత్రుదేశాలకు పక్కలో బల్లెంగా ఉన్న వరుణాస్త్ర, బహ్మోస్ క్షిపణులు స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్నవేనని అన్నారు. కార్బన్ కాంపొజిట్స్‌తో తయారైన యాంటి సబ్‌మెరైన్ వార్‌ఫేర్ కలిగిన ఐఎన్‌ఎస్ కిల్తాన్ యుద్ధ నౌక తొలిసారిగా భారత నౌకాదళంలో చేరిందన్నారు. నౌకాదళాలు కలిగిన అతి కొద్ది దేశాలు మాత్రమే ఇటువంటి యుద్ధ నౌకలను వినియోగిస్తున్నాయని వివరించారు. అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు ఈ నౌకలో ఉన్నాయన్నారు. సాంకేతికంగా భారత నౌకాదళం ఇప్పటికే అనేక విజయాలను నమోదు చేసుకుందని, అందులో ఇది ఒకటన్నారు. భారత సముద్ర జలాల రక్షణలో సవాళ్లను ఎదుర్కొనేందుకు కిల్తాన్ ఎంతగానో సహకరిస్తుందని లాంబా చెప్పారు. తరువాత నౌక కమాండర్ నౌషద్ అలీఖాన్ నౌక జలప్రవేశం చేస్తున్నట్టు చెప్పే వారెంట్‌ను చదివి వినిపించారు. తరువాత నౌక మీదున్న ఫలకాన్ని మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి నిర్మలా సీతారామన్ 50 మంది నౌకాదళ సిబ్బంది ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. తరువాత ఆమె ఐఎన్‌ఎస్ కిల్పాన్ నౌక అంతర్భాగాలను పరిశీలించారు. కార్యక్రమంలో తూర్పు నౌకాదళ అధికారి వైస్ అడ్మిరల్ బిస్త్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సిఎండి వి.కె.సక్సేనా పాల్గొన్నారు.

చిత్రం..ఐఎన్‌ఎస్ కిల్పాన్ నౌక గురించి వివరిస్తున్న నేవీ చీఫ్ సునీల్ లాంబ