రాష్ట్రీయం

త్వరలో బీసీ జనగర్జన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 16: తన పాదయాత్ర తర్వాత బీసీ జనగర్జన నిర్వహిస్తామని ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సోమవారం విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో తొలిసారి నిర్వహించిన బీసీ సెల్ సమావేశంలో మాట్లాడారు. 10 వేల కోట్లతో సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తానన్న చంద్రబాబు, బీసీలను మోసం చేశారని, దీన్ని బీసీలను వివరించాలన్నారు. పాదయాత్ర తర్వాత బీసీ జనగర్జన నిర్వహించి బీసీ డిక్లరేషన్ ప్రకటిద్దామని, అందులో అన్ని కులాలకు న్యాయం చేద్దామన్నారు. బీసీ విద్యార్థులకు వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రకటిస్తే, బాబు దానిని దూరం చేసిన వైనాన్ని బీసీలకు చెప్పాలన్నారు. తన పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో బీసీలకు బాబు చేసిన అన్యాయాన్ని వివరించాలన్నారు. సమావేశంలో బొత్స సత్యనారాయణ, కె.పార్ధసారథి, బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర కార్యాలయం నిర్మించిన తర్వాత తొలిసారి నిర్వహించిన బీసీ సెల్ సదస్సుకు కార్యకర్తలు తక్కువ హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలను లోపలకు అనుమతించకుండా బయట గేటు వద్దే నిలిపివేయడంతో వెనక్కి వెళ్లిపోవలసి వచ్చింది. చేతి, కుల వృత్తుల వారు ఆవరణలో నిర్వహించిన ప్రదర్శనను జగన్ లోపలికి వెళ్లిన వెంటనే వాటిని వెంట తీసుకువెళ్లారు.

చిత్రం..బీసీ సదస్సులో మాట్లాడుతున్న వైకాపా నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి