రాష్ట్రీయం

సాగర్‌కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, అక్టోబర్ 16: నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి ఇన్‌ఫ్లో సోమవారం కూడా కొనసాగుతోంది. ఆదివారం 2 లక్షలకు పైగా శ్రీశైలం నుండి ఇన్‌ఫ్లో ఉండగా సోమవారం ఉదయం కొద్దిమేరకు తగ్గి 1,29,603 క్యూసెక్కులు వచ్చి చేరుకుంటోంది. మధ్యాహ్నం 3 గంటలకు 1,49,104 క్యూసెక్కుల నీరు వస్తుండగా రాత్రి 7గంటలకు 1,57,311 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుకుంటోంది. శ్రీశైలానికి ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో సోమవారం ఉదయానికి కొద్దిమేరకు తగ్గినా సోమవారం సాయంత్రానికి పెరిగింది. దీంతో శ్రీశైలం నుండి సాగర్‌కు విడుదల చేసే నీటి పరిమాణాన్ని కూడా సోమవారం సాయంత్రం పెంచారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 552.10 అడుగులకు పెరిగింది. సాగర్ నుండి ఎస్‌ఎల్‌బిసి ద్వారా 1650 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి ఎగువ నుండి 1,49,160 క్యూసెక్కులు వస్తుండగా ప్రస్తుతం శ్రీశైలంలో 884 అడుగుల నీటిమట్టం ఉంది. శ్రీశైలం ఎగువ భాగాన ఉన్న కృష్ణానది పరివాహక ప్రాంతం ప్రాజెక్టు నుండి వరద ఉదృతి పెరుగుతున్న కారణంగా శ్రీశైలానికి, దిగువన సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
చిత్రం.. 552 అడుగులకు పెరిగిన నాగార్జునసాగర్ నీటిమట్టం