రాష్ట్రీయం

ఓ కంట కనిపెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: ఇబ్బడిముబ్బడిగా వస్తున్న అరబ్ షేక్‌లను, ముస్లిం వివాహాలను నిర్వహించే ఖాజీలను ఓ కంట కనిపెట్టాలని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్‌లు ఉమ్మడిగా కేంద్రానికి నివేదిక సమర్పించబోతున్నాయి. వివాహాల సందర్భంగా మైనర్ బాలికలు ఉన్నా కొంతమంది ఖాజీలు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారని, అరబ్ షేక్‌లు విదేశాలకు మైనర్లను తీసుకెళ్ళేప్పుడు పాస్ పోర్టు, ఇమ్మిగ్రేషన్ విషయాల్లో మరింత కఠినంగా ఉండాలనీ నివేదికలో పేర్కొనబోతున్నాయి. హైదరాబాద్, పాతనగరంలో ఎక్కువగా అరబ్ షేక్‌లు ముస్లిం మైనర్ బాలికలను వివాహం చేసుకోవడంపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ కమిటినీ నియమించారు. ఈ కమిటీలో జాతీయ మహిళా కమిషన్ సభ్యుడు అలోక్ రావత్, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్-పర్సన్ డాక్టర్ త్రిపురాన వెంకటరత్నం ఉన్నారు. వారు సోమవారం పాతనగరంలోని సుమారు
30 మందితో చర్చించి, లోపాలు ఎక్కడ ఉన్నాయి, ఏ కారణాలతో మైనర్ బాలికలను విక్రయిస్తున్నారు?, అరబ్ దేశాలకు ఎలా తీసుకెళ్ళగలుగుతున్నారు?, అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఇతరులకు విక్రయించడం, పేరుకు వివాహం చేసుకున్నా, అరబ్ దేశాలకు తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో సేవకురాలిగా చూడడం వంటి హృదయ విదారకరమైన ఘటనల గురించి వారు సమాచారాన్ని సేకరించారు. కొంత మంది తల్లిదండ్రులు ఆర్థిక పరమైన కారణాలతో మైనర్ బాలికలను షేక్‌లకు విక్రయించడం జరుగుతున్నదని, మధ్యవర్తుల ద్వారా కొంత మంది ఖాజీలు కుమ్మక్కై బాలికల వయస్సు విషయంలో తప్పుడు ధృవీకరణ చేయడం, ఇమ్మిగ్రేషన్‌లోనూ కఠినంగా ఉండకపోవడం వంటి వివిధ కారణాలు తమ దృష్టికి వచ్చాయని అలోక్ రావత్, డాక్టర్ త్రిపురాన వెంకటరత్నం మంగళవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. అసలు అరబ్ షేక్‌లు ఎందుకు వస్తున్నారనే కోణంలో దృష్టి పెట్టాలని, వచ్చిన వారిపై తిరిగి వెళ్ళేంత వరకూ ఓ కంట కనిపెట్టాలని వారు చెప్పారు. తమ దృష్టికి వచ్చిన అనేక అంశాలను వారం రోజుల్లో కేంద్రానికి సమగ్ర నివేదిక అందించనున్నట్లు వారు చెప్పారు. మైనర్ బాలికలను విక్రయించడం, వివాహాం చేయడం వంటివి ఎక్కువగా ఆర్థికపరమైన కారణాలతో జరుగుతున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయాలని సూచించనున్నట్లు వారు తెలిపారు.
చైతన్యవంతం చేసేందుకు..
మైనర్ బాలికలకు వివాహాలు చేయడం, విక్రయించడం కేవలం ముస్లింల్లోనే కాకుండా ఇతర కుల, మతాల్లోనూ ఉందన్నారు. ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టనున్నట్లు అలోక్ రావత్, డాక్టర్ త్రిపురాన తెలిపారు.

చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న కమిషన్ సభ్యులు