రాష్ట్రీయం

జగన్ పాదయాత్రపై 23న తీర్పు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: వచ్చే నెల 2వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్న సందర్భంగా కోర్టు కేసులకు హాజరు నుంచి మినహాయింపు కావాలని కోరుతూ వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైదరాబాద్ సిబిఐ కోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ మేరకు శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. తీర్పు 23వ తేదీన వెలువడే అవకాశాలు ఉన్నాయి. జగన్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ జగన్ దాదాపు మూడు వేల కి.మీ మేర పాదయాత్ర చేపట్టనున్నారని కోర్టుకు తెలిపారు. ఆరు నెలల పాటు జగన్‌కు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్ధించారు. కాగా జగన్ తరఫున న్యాయవాది చేసిన వాదనలను సిబిఐ న్యాయవాదులు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుని పాదయాత్ర సందర్భంగా కోర్టులంటే తనకు గౌరవం ఉందని, అందుకే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతానని ప్రజలకు జగన్ తెలియచేయాలని సూచించింది. కాగా పాదయాత్ర మధ్యలో విరామం ఇవ్వడం వల్ల స్ఫూర్తి నీరుకారుతుందని జగన్ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం కోర్టు తన నిర్ణయాన్ని 23వ తేదీన వెల్లడిస్తానని ప్రకటించారు.