రాష్ట్రీయం

శ్రీశైలం గేట్లు మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఆక్టోబర్ 20: శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడంతో గురువారం గేట్లు మూసివేశారు. ఎగువ నుంచి 49 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది. దీంతో విద్యుదుత్పత్తి ద్వారా సాగర్‌కు 39 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి 884.20 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 210.99 టిఎంసిలుగా ఉంది. జూరాల నుంచి 45 వేల క్యూసెక్కులు, రోజా నుంచి 4,479 క్యూసెక్కులు కలిపి మొత్తం 49,479 క్యూసెక్కుల నీరు శ్రీశైలం చేరుకుంటోంది. మొదటి పవర్‌హౌస్‌లో విద్యుత్ ఉత్పత్తి అనంతరం 18,539 క్యూసెక్కులు, రెండవ పవర్ హౌస్‌లో విద్యుత్ ఉత్పత్తి అనంతరం 21,189 క్యూసెక్కులు కలిపి మొత్తం 39,728 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి నీరు విడుదల చేస్తున్నారు.