రాష్ట్రీయం

శ్రీశైలంలో కార్తీక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, అక్టోబర్ 20: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శుక్రవారం నుంచి కార్తీక మాస పూజలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి, అమ్మవార్లకు మహానివేదన కార్యక్రమాన్ని శుక్రవారం శాస్త్రోక్తంగా వేదపండితులు నిర్వహించారు. సాయంత్రం ఆకాశదీపాన్ని వెలిగించారు. కార్తీకమాసం నెల పొడవునా ఈ దీపాన్ని వెలిగిస్తారు. శ్రీశైలం వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ సందర్శన వేళల్లో మార్పులు చేశారు. ముఖ్య పర్వదినాలు, రద్దీరోజులు ( శని, ఆది) ప్రభుత్వ సెలవురోజులు, కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి రోజున భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి ప్రాతః కాలపూజలు అనంతరం 3.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రద్దీరోజుల్లో సుప్రభాత సేవ, మహామంగళహారతి, లక్ష కుంకుమార్చన టికెట్ల జారీ రద్దు చేశారు. మిగతా రోజుల్లో తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ప్రాతఃకాల పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అదే విధంగా ఆర్జిత, చండీహోమం, రుద్రహోమాల్లో మార్పులు చేశారు. కార్తీకమాసంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు రుద్రహోమం, చండీహోమం నిర్వహిస్తారు కాబట్టి భక్తుల సౌకర్యార్థం హోమాలను ఉదయం 7 గంటల నుంచి ఒక విడత, 7.30 గంటల నుండి 2వ విడత చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆర్జిత అభిషేకాల్లో భాగంగా కార్తీకమాసం మొత్తం సోమవారాలు, పౌర్ణమి రోజున అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించుకునేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో 800 టికెట్లు జారీ చేస్తుండగా రద్దీ రోజుల్లో మరో వంద కలిపి మొత్తం 900 టికెట్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అభిషేకాలను భక్తులు మూడు విడతల్లో నిర్వహించుకునేందుకు సౌకర్యం కల్పిస్తారు. ఆర్జిత సేవ టికెట్లు కావాల్సిన భక్తులు డబ్ల్యూడబ్ల్యూడబ్యూ.శ్రీశైలం ఆన్‌లైన్.కామ్ ద్వారా ముందుగా బుక్ చేసుకోవచ్చు.