రాష్ట్రీయం

కలిసి.. పనిచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్‌ను ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ హబ్‌గా చేసుకోవచ్చని సిఎం చంద్రబాబు ఎమిరేట్స్ విమానయాన సంస్థలకు సూచించారు. ఆదివారం ఎమిరేట్స్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ఇన్‌చార్జ్ అద్నాన్ ఖాజిమ్, ఫ్లైదుబాయ్ సిఈవో ఘయిత్ అల్ ఘయిత్‌లతో భేటీఅయ్యారు. ఎయిర్‌క్రాప్ట్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాయిల్ సదుపాయాలు కల్పించేందుకు ఆంధ్రలో అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. రాష్ట్రంలో ఒక విమానాశ్రయం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా మధ్యప్రాచ్య, దక్షిణాసియాలకు మధ్యలో ఉందని, అమరావతి, విశాఖ, తిరుపతి నగరాలను దుబాయ్‌కి అనుసంధానం చేయవచ్చని సూచించారు. ఆంధ్రను ఎమిరేట్స్ హబ్‌గా తీర్చిదిద్దటం ద్వారా ఉభయ దేశాల స్నేహబంధం మరింత బలపడుతుందని చంద్రబాబు సూచించారు. తమకు ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్‌ల ప్రతినిధి బృందంతో ఒక టాస్క్ఫోర్స్ ఉందని, మనం సంయుక్తంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని పనిచేద్దామని ఫ్లైదుబాయ్ సిఈవో ఘయిత్‌కు ప్రతిపాదించారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమిరేట్స్‌ను మొదటిసారి హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఎంతో చొరవ తీసుకున్నారని ఎమిరేట్స్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ఇన్‌చార్జ్ అద్నాన్ ఖాజిమ్ గుర్తుచేశారు. ఒక పని తలపెడితే చంద్రబాబు కార్యదీక్ష ఎటువంటిదో తమకు ఇంకా జ్ఞాపకం ఉందన్నారు. ఇప్పటికీ చంద్రబాబులో అదే ఉత్సాహాన్ని చూస్తున్నామని ప్రశంసించారు.
సుల్తాన్ బిన్ సరుూద్ మన్సూరీతో భేటీ
ఐటి, బ్లాక్‌చైన్, ఫిన్‌టెక్ రంగాల్లో ఆంధ్రతో కలిసి పనిచేయడానికి ఫెడరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ చైర్మన్ సుల్తాన్ బిన్ సరుూద్ అల్ మన్సూరీ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆదివారం దుబాయిలో సిఎం చంద్రబాబు ఆయనతో సమావేశమయ్యారు. భారతదేశం మొత్తానికి భౌగోళికంగా ఏపి వ్యూహాత్మక సవ్యదిశలో ఉందని ముఖ్యమంత్రి అన్నారు. రహదారి, రైలు, జలమార్గాలతో దేశం మొత్తానికి అనుసంధానం కలిగిన రాష్ట్రం ఆంధ్ర అన్నారు. తమ దేశానికి వేల కిలోమీటర్ల సముద్ర తీరం, అందులో ఒక్క తమ రాష్ట్రానికే దాదాపు వేయి కి.మీల సాగరతీరం ఉందని తెలిపారు. తమ రాష్ట్రానికి సమాంతరంగా రహదారి అనుసంధానం ఉందని, దాంతోపాటు అంతర్గత జలమార్గాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ‘మీ నైపుణ్యంపై మాకు మంచి గురి ఉంది. ఏపీతో దుబాయ్, సింగపూర్, హాంగ్‌కాంగ్ వంటి అంతర్జాతీయ నగరాలను జల, వాయుమార్గాల్లో అనుసంధానం చేయాలని భావిస్తున్నామని’ ముఖ్యమంత్రి తెలిపారు. ఐటీలో ఏపీకి ఉన్న అనుభవం, నైపుణ్యం మీకు తెలుసని, అత్యుత్తమ మానవ వనరులు తమ సొంతమని, ఏపీ ప్రజలు ఏ రంగంలోనైనా దూసుకెళ్లే ఉత్సాహం ఉన్నవారని ఈసందర్భంగా ముఖ్యమంత్రి అభివర్ణించారు.
రవాణా మార్గాల పరంగా అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి ఫలాలు అందుకోవడం తమను ఎంతగానో ఆకట్టుకుందని, ముఖ్యంగా రాష్ట్రాన్ని రవాణా మార్గాల దిశగా అభివృద్ధి చేస్తున్న తీరు బాగుందని సుల్తాన్ బిన్ సరుూద్ అల్ మన్సూరీ ప్రశంసించారు. యుఏఈ లాజిస్టిక్స్ రంగంలో విజయవంతంగా ముందుకెళ్లిందని చెపుతూ తప్పనిసరిగా ఉభయులం కలిసి పనిచేద్దామన్నారు. వేగవంతంగా సరుకు రవాణా చేయడం, అంతే వేగంగా ప్రయాణికుల్ని కూడా గమ్యస్థానాలకు చేర్చడమన్నది విమాన రంగంలో ఉన్న ముఖ్యమైన సవాల్ అని మన్సూరి స్పష్టం చేశారు. ఇండియా, యుఏఈ మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగ్గా, దృఢంగా ఉన్నాయని, యుఎఇకు ఇండియా ప్రథమ వాణిజ్య భాగస్వామిగా ఉందని ఆయన చెప్పారు. ఉభయ ప్రభుత్వ వర్గాలతో సంయుక్త కార్యబృందం ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలికి సమన్వయ బాధ్యతలు అప్పగించారు. కార్యబృందంలో తమ తరపు ప్రతినిధులను ఖరారు చేసి తమ రాయబారి ద్వారా తెలియజేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో రాయబారి నవదీప్ సింగ్ సూరీ పాల్గొన్నారు.
దుబాయ్ తరహా పర్యాటక ఆకర్షణలు
కృష్ణానదికి అభిముఖంగా నిర్మిస్తున్న రాజధాని అమరావతిలో, సాగరతీరం విశాఖలో బుర్జ్ ఖలీఫా దగ్గర సముద్ర భాగంలోని అట్లాంటిస్ హోటల్, ఆక్వా వెంచర్ పార్క్ తరహా పర్యాటక ఆకర్షణలు ఉండి తీరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మలిచే కృషిలో భాగంగా శనివారం రాత్రి సమావేశాలు ముగిశాక దుబాయ్ నగరంలోని ముఖ్య ఆకర్షణీయ ప్రదేశాలను ఆయన మంత్రులు, అధికారులతో కలిసి సందర్శించారు. ఏపీ పర్యాటక రంగంలో ఇలాంటి ఆకర్షణలు జతచేస్తే మరింత ఆహ్లాదంగా, అద్భుతంగా ఉంటుందని మంత్రులు, అధికారులకు చంద్రబాబు సూచించారు.

చిత్రం..దుబాయ్ ఫెడరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ చైర్మన్ సుల్తాన్ బిన్ సరుూద్ అల్ మన్సూరీకి శాలువా కప్పి సత్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు