రాష్ట్రీయం

డిసెంబర్ 1నుంచి రబీకి సాగర్ నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, అక్టోబర్ 22: నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఎగువ నుంచి నీరు వచ్చి చేరడంతో రబీలో సాగర్ ఆయకట్టుకు అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎనె్నస్పీ ఎడమ కాల్వ పరిధిలోని నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పరిధిలోని సుమారు 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి మార్చి 1 వరకు వారాబందీ పద్ధతిలో నీరు విడుదల చేస్తూ ఆయకట్టు భూములకు అందించాలని, ఇందుకోసం సుమారు 30 టిఎంసిలు కావాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఆదివారం నాటికి 571 అడుగుల నీటిమట్టంతో 261 టిఎంసిల నీరు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సాగర్ ఆయకట్టుకు రబీ సీజన్‌లో ఈ నీరు సరఫరా చేయాల్సి ఉంది. కృష్ణానది యాజమాన్య బోర్డు తెలంగాణ రాష్ట్రానికి 48శాతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 52శాతం నీటిని కేటాయించింది. ఈ కేటాయింపుల ఆధారంగానే నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని తెలుగు రాష్ట్రాలు వాడుకోవాల్సి వుంది. అంతేకాకుండా హైదరాబాద్ జిల్లాతో పాటు నల్గొండ జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకు సరఫరా చేయాల్సి వుంది.
గత రబీ సీజన్‌లో వారాబందీ పద్ధతిలో సాగునీరు సరఫరా చేయడంతో వరి దిగుబడి బాగా పెరిగిందని గుర్తించిన వ్యవసాయ శాఖాధికారులు ఈ సీజన్‌లో కూడా అదే పద్ధతిలో నీరు విడుదల చేయనున్నారు. తొమ్మిది రోజులు సాగునీటిని సరఫరా చేస్తారు. తరువాత ఆరురోజులు కాల్వలకు నీటి సరఫరాను నిలిపివేస్తారు. ఈ పద్ధతిలో కాల్వలకు నీటి సరఫరాను మార్చుతూ షెడ్యూల్ రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. సాగర్ ప్రధాన కాల్వకు అనుసంధానంగా ఉన్న మేజర్ కాల్వలకు కూడా ఇదే పద్ధతిలో నీరు విడుదల చేస్తారు. ఈవిధంగా ఒక్కో ప్రాంతంలోని భూములకు తొమ్మిదిసార్లు నీరందించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న 17 మండలాలకు గత ఐదేళ్లుగా సాగునీరు అందలేదు. ఈ దఫా సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రాజెక్టులోకి మరింతగా నీరు చేరితే అప్పటి పరిస్థితుల ఆధారంగా షెడ్యూల్‌ను సవరించే అవకాశం ఉంటుంది. దీనిపై ఎనె్నస్పీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముందస్తు ఏర్పాట్లలో భాగంగా షెడ్యూల్ రూపొందించామని తెలిపారు. సాగర్ నుంచి ముందుగానే నీరు విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే అందుకు అనుగుణంగా షెడ్యూల్‌ను సవరిస్తామని, అయితే నీరు ఎప్పుడు విడుదల చేసినా వారాబందీ విధానమే అమలు చేస్తామని వివరించారు.