రాష్ట్రీయం

చకచకా 2బిహెచ్‌కె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలంగాణలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న కెసిఆర్ కల కార్యరూపంలో పరుగందుకుంది. పేదల ఇళ్ల నిర్మాణంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రంలో గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 2బిహెచ్‌కెలపై ప్రభుత్వం పెట్టిన ఖర్చు 14 రెట్లు పెరిగి, 378.48 కోట్ల నుంచి రూ.529.84 కోట్లకు చేరింది. వివిధ జిల్లాల్లో పరిపాలనా అనుమతులు పొందిన యూనిట్లు 59,829 నుంచి 2,06,518కి పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 68,564 ఇళ్ల నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ప్రారంభించింది. ఇవి వివిధ దశల్లో ఉన్నాయి. కాగా మరో 1,19,422 ఇళ్ల నిర్మాణానికి దాదాపు టెండర్లు ఖరారు చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో 2బిహెచ్‌కె స్కీం కింద 39,253 యూనిట్లకు టెండర్లు పిలిస్తే, ఈ ఏడాది సెప్టెంబర్‌కు ఆ సంఖ్య 1,78,913కు పెరిగింది. కాంట్రాక్టర్లకు సబ్సిడీ రేట్లకే సిమెంట్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. దీని నిమిత్తం సిమెంట్ తయారీ దార్లతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత పదేళ్లలో ఒక్కసారైనా ఇళ్ల నిర్మాణంలో అనుభవమున్న కాంట్రాక్టర్లకే 2బిహెచ్‌కె నిర్మాణాలు అప్పగించాలన్న
నిర్ణయంతో, ప్రభుత్వం స్కీం వేగం పెంచింది. ఇళ్ల నిర్మాణంపై జిఎస్టీ ప్రభావం పడుతుందనే భయాలు తొలగిపోతున్నాయి. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల స్కీంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడలేదు. నివాస గృహాల ఖర్చు అంచనాల్లో 70 శాతం వ్యయం మెటీరియల్, 30 శాతం లేబర్‌కు అవుతుంది. అలాగే నిర్మాణ సామాగ్రికి ఐదునుంచి ఎనిమిది శాతం వరకు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. ప్రభుత్వం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపిసి) నుంచి ఉచితంగా ఫ్లై యాష్ తెప్పించి 2బిహెచ్‌కె ఇళ్ల నిర్మాణంలో ఉపయోగిస్తోంది. దీనివల్ల వ్యయం తగ్గుతోంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఇంటి నిర్మాణానికి రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.03 లక్షలు, జిహెచ్‌ఎంసి ప్రాంతంలో రూ.7.79 లక్షల సొమ్మును ప్రభుత్వం కేటాయించింది. ఈ ఏడాదిలో 2.7 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. ఇందులో లక్ష ఇళ్లను జిహెచ్‌ఎంసి పరిధిలో నిర్మించాలని సంకల్పించింది. జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రులు ప్రతిదశలో 2బిహెచ్‌కె నిర్మాణాలను పర్యవేక్షిస్తున్నారు. ఇందులో లోపాలుంటే వెంటనే అధికారుల దృష్టికి తెచ్చి సరిదిద్దుతున్నట్లు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
సిద్ధిపేట ఫస్ట్
2బిహెచ్‌కె స్కీం అమలులో 76 శాతం మార్కులతో సిద్ధిపేట అగ్రగామిగా ఉంది. 70 శాతం మార్కులతో గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ద్వితీయ స్ధానంలో నిలిచింది. కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మేడ్చెల్- మల్కాజ్‌గిరి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్ జిల్లాల్లో స్కీం పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్, మెదక్, మహబూబాబాద్, సంగారెడ్డి, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, పెద్దపల్లి, ఆదిలాబాద్, వరంగల్ రూరల్‌లో పనులు మాదిరిగా అమలవుతున్నాయి. నాగర్‌కర్నూలు, జగిత్యాల, వనపర్తి, నిర్మల్, నల్లగొండ, మంచిర్యాల, రంగారెడ్డి, వికారాబాద్, కొమురంభీం, జోగుళాంబ గద్వాల్ జిల్లాలో పనులు వేగం పుంజుకోవాల్సి ఉందని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. కొన్ని జిల్లాల్లో కాంట్రాక్టర్ల కొరత వల్ల 2బిహెచ్‌కె నిర్మాణం పనులు మందకొడిగా సాగుతున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇందిరా ఆవాస్ యోజన స్కీం కింద కూడా 4.11 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.87.64 కోట్ల నిధులు మంజూరు చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో రూ.6015.78 కోట్ల నిర్మాణంతో 2బిహెచ్‌కె ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ముగిసింది. 109 ప్రదేశాల్లో 2బిహెచ్‌కె కాలనీలను నిర్మించనున్నారు.