రాష్ట్రీయం

వేతనాల కోసం కదం తొక్కిన అంగన్‌వాడీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 27: పెంచిన వేతనాల జీఓను వెంటనే విడుదల చేయాలంటూ అంగన్‌వాడీ వర్కర్లు చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం శుక్రవారం ఉత్తరాంధ్రలో ఉద్రిక్తంగా జరిగింది. కలెక్టరేట్లలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించిన అంగన్‌వాడీలు కలెక్టరేట్ వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. వీరు కలెక్టరేట్ లోపలకు ప్రవేశించకుండా గేట్లు మూసివేసిన పోలీసులు కంచెలు, తాళ్లతో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో వాగ్వివాదాలు జరిగాయి. చివరకు దొరికిన వారిని దొరికినట్టుగా పోలీసులు వ్యాన్‌ల్లోకి స్టేషన్లకు తరలించారు. విజయనగరంలో పోలీసు వలయాన్ని ఛేదించుకుని కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించినపుడు తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. పరిస్ధితి ఉద్రిక్తంగా మారుతుండటంతో ప్రజాసంఘాల నాయకులను ఒక్కరిగా కలెక్టరేట్ గేటు లోపలికి తీసుకువెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన ఆంగన్‌వాడీలను ముందుగానే ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ భారీ సంఖ్యలో కలెక్టరేట్ వద్దకు చేరుకున్న అంగన్‌వాడీలు ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు లోపలికి వెళ్లకుండా అందోళనకారులు అడ్డుకోవటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ముట్టడి కార్యక్రమానికి సిపిఎం, వైకాపా, సిఐటియు మద్దతు తెలిపాయి.

విశాఖ కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అంగన్‌వాడీలను అరెస్టు చేస్తున్న పోలీసులు