రాష్ట్రీయం

తడిసిన ధాన్యం కొనాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపేట/తణుకు, నవంబర్ 27: అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణం మద్దతు ధరకు కొనుగోలుచేయాలని వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్‌చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొత్తపేట తణుకు మండలాల్లో నష్టపోయిన వరి పొలాలను శుక్రవారం జగన్ పరిశీలించారు. కొత్తపేట శివారు చినగూళ్ళపాలెం, పెదగూళ్ళపాలెం గ్రామాల్లో నష్టపోయిన వరి పంటను, అలాగే తడిసిన వరిధాన్యాన్ని ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రైతులకు జరిగిన నష్టాన్ని జగన్‌కు వివరించారు. తుపాన్ల కారణంగా పంటను ఏవిధంగా కోల్పోతున్నామో రైతులు జగన్‌కు వివరించారు. అలాగే గత తుపాన్ల సమయంలో వేసిన పంటనష్టం పరిహారాలు నేటికి అందని విషయాన్ని వారు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం దువ్వ గ్రామంలో వరిపొలాలను జగన్ పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. ఈసందర్భంగా జగన్ విలేఖర్లతో మాట్లాడుతూ రెండు జిల్లాల్లో వరిపంటకు అపార నష్టం సంభవించినా, రైతులకు భరోసా ఇచ్చి ఆదుకోలేకపోయారని ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లాలో లక్షన్నర ఎకరాల్లో, పశ్చిమ గోదావరి జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లగా, నేటికీ పంట నష్టం అంచనాలను కూడా వేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. నష్టపోయిన రైతులను పరామర్శించడానికి రాని ముఖ్యమంత్రి కనీసం తడిసిన ధాన్యానికి మద్దతు ధర ప్రకటిస్తూ జివోలు కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. గత తుపాన్ల సహాయాలే నేటికి రైతులకు అందలేదని, ఇప్పుడు వచ్చిన నష్టానికి అంచనాలు ఎప్పుడు వేస్తారు, సాయం ఎప్పుడు అందిస్తారని ప్రశ్నించారు. పంటనష్టం విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా తడిసిన ధాన్యానికి మద్దతు ధరకు కొనుగోలుచేయాలని, నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించాలని జగన్ డిమాండ్ చేశారు.

తూ.గో.లో నష్టపోయిన రైతులతో మాట్లాడుతున్న జగన్