రాష్ట్రీయం

ఐరన్ వ్యాపారి ఇంట్లో భారీ పేలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 29: విజయవాడ పటమట పోలీస్టేషన్ పరిథిలోని ఓ ఐరన్ వ్యాపారి ఇంట్లో శుక్రవారం గ్యాస్ పేలుడు సంభవించింది. ప్రమాదవశాత్తు సంభవించిన ఈ పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటి యజమాని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాత్రంతా గ్యాస్ లీకై ఉండటంతో ఉదయం సిగరెట్ వెలిగించగానే ప్రమాదం చోటు చేసుకున్నట్లు విజయవాడ లా అండ్ ఆర్డర్ డిసిపి కాళిదాసు రంగారావు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన తీరును బట్టి చూస్తే.. బాంబులుగాని, భారీ పేలుడు పదార్ధాల వల్ల గాని పేలుడు సంభవించినట్లు భావిస్తున్నారు. ఈఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చుట్టుప్రక్కల సైతం ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆటోనగర్‌లో తుక్కు ఇనుము వ్యాపారి అయిన రెడ్డి రంగారావు (55) పటమట పంటకాలువ రోడ్డు విజయనగర్‌కాలనీ నాలుగోలైన్‌లో నివాసముంటున్నాడు. రెండంతస్తుల సొంత భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ అద్దెకు ఇవ్వగా, మొదటి అంతస్తులో రంగారావు అతని భార్య శాంతకుమారి ఉంటున్నారు. కుటుం బ సభ్యులంతా గురువారం రాత్రి నిద్రకు ఉపక్రమించారు. మరుసటి రోజు శుక్రవారం ఉదయం నిద్ర లేచిన రంగారావు పడకగది నుంచి హాలులోకి వచ్చాడు. బాత్‌రూముకు వెళ్ళేముందు అలవాటు ప్రకారం సిగరెట్ వెలిగించాడు. హఠాత్తుగా పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. ఇల్లంతా చెల్లచెదురై బీరువా, ఇతర సామాగ్రి ధ్వంసమైంది. గోడలు బీటలువారాయి. కిటికీ, తలుపులు విరిగి ప్రక్కింటి ఆవరణలో ఎగిరిపడ్డాయి. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలకు సామగ్రి కాలిబూడిదైంది. రంగారావు తీవ్రంగా గాయపడ్డాడు. ఇంట్లో భార్య ప్రమాదం నుంచి భయటపడ్డారు. సమాచారం అందుకున్న డిసిపి రంగారావు, సెంట్రల్ ఏసిపి ప్రభాకర్‌బాబు, పటమట సిఐ కెనడి, ఎస్‌ఐ మోహన్‌రావు సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలాన్ని చేరుకున్నారు. మరోవైపు క్లూస్, వేలిముద్రల నిపుణులు, బాంబు స్క్వాడ్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వీటితోపాటు అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలాన్ని చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇంట్లో రెండు ఖాళీ సిలెండర్లతోపాటు ఒక నిండు సిలెండర్ ఉంది. ఆరోజే తీసుకువచ్చిన ఈ సిలెండర్ వాడలేదు. నిద్రకు ఉపక్రమించే ముందు గ్యాస్ కట్టేయడం మరిచిపోవడంతో సిలెండర్‌లోని ఆరున్నర కేజీల గ్యాస్ లీకై తలుపులు, కిటికీలు మూసి ఉంచడంతో ఇల్లంతా అలముకుందని, ఉదయం సిగరెట్ వెలిగించగానే ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు తెలిసింది.