రాష్ట్రీయం

ఇద్దరు చంద్రుల మ్యాచ్‌ఫిక్సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: ఓటుకు నోటు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిహెచ్‌ఎంసి ఎన్నికల సందర్భంగా నిర్భయంగా తిరుగుతున్నా టిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోకుండా చోద్యం చూస్తోందని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. టిఆర్‌ఎస్, టిడిపి పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని ఆయన అన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిడిపి, టిఆర్‌ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రకటనలతో మోసం చేస్తున్నాయన్నారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి రాజధానిలో సెక్షన్ 8 అమలు చేయాలని, ప్రత్యేకంగా ఏపి పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తామని బీరాలు పలికిన చంద్రబాబు ఇప్పుడా మాట ఎందుకు ప్రస్తావించడం లేదన్నారు. టిడిపి ప్రభుత్వం స్ధానిక సంస్ధలను అపహాస్యం చేస్తోందన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అధికారంలోకి వస్తే అన్ని వౌలిక సదుపాయాలు కల్పిస్తామంటున్న చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రంలో స్ధానిక సంస్ధలను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, మచిలీపట్నం మున్సిపపాలిటీలను నగర పాలక సంస్ధలుగా హోదా కల్పించారని, కాని ఎన్నికలు మాత్రం నిర్వహించలేదన్నారు. స్ధానిక సంస్ధలకు నిధులు, విధులు అప్పగించకుండా ఏకపక్ష వైఖరితో చంద్రబాబు ఉన్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేశారని, ఇందులో ఏ పనికి ఎంత మొత్తంలో కేటాయించారో వివరాలు లేవన్నారు. ఇదంతా చూస్తుంటే టిడిపికి భారీ ఎత్తున ముడుపులు ముడుతున్నాయని విదితమవుతోందన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో వ్యవసాయ పరిరక్షణ జోన్ నిబంధనలు సడలించాలని ఆయన డిమాండ్ చేశారు.
స్మార్ట్ సిటీగా
తిరుపతినీ గుర్తించండి
క్యాబినెట్ కార్యదర్శికి సిఎస్ వినతి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 29: తిరుపతి పట్టణాన్ని సైతం స్మార్టు సిటీగా గుర్తించే అవకాశాలను పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ప్రదీప్ సిన్హాను కోరారు. బుధవారం ఆయన ప్రదీప్ సిన్హాతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. స్మార్టు సిటీల అమలుగురించి ఈ సందర్భంగా క్యాబినెట్ కార్యదర్శి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు వివరించారు. దేశవ్యాప్తంగా 98 స్మార్టు సిటీలను గుర్తించారు. ప్యానల్స్ అధ్యయనం తర్వాత స్మార్టు సిటీల ఎంపిక జరిగిందని క్యాబినెట్ కార్యదర్శి వివరించారు. విశాఖపట్టణం, కాకినాడలను స్మార్టు సిటీలుగా ఎంచుకోవడంపై సిఎస్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, సమగ్రమైన ప్రణాళికలు రూపొందించి సమర్పించిందని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్లానింగ్ చీఫ్ సెక్రటరీ ఎస్‌పి టక్కర్, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి కరికల వలవెన్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ వినయ్‌చంద్ తదితరులు పాల్గొన్నారు.

500మంది ఎంబిఎ విద్యార్థులకు
రూ. కోటి స్కాలర్‌షిప్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 29: దేశవ్యాప్తంగా అర్హులైన 200 మంది విద్యార్ధులకు ఎంబిఎ స్కాలర్‌షిప్‌లను అందించేందుకు ప్రముఖ ఆర్ధిక సంస్థ క్యాపిటల్ ఫస్టు ముందుకొచ్చింది. క్యాపిటల్ ఫస్టుతో పాటు పనిచేస్తున్న టైమ్స్ ప్రో సంస్థ ప్రెసిడెంట్ అనీష్ శ్రీకృష్ణ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, అజీన్ క్యా డై పాటిల్ యూనివర్శిటీ, కెఎల్ యూనివర్శిటీ, శారదా యూనివర్శిటీ, జైన్ యూనివర్శిటీల్లో ఎంబిఎ చేసే వారికి ఈ సదుపాయం వర్తిస్తుందని చెప్పారు.

ఇసుక రీచ్‌ల వేలంపై హైకోర్టు స్టే
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 29: గుంటూరు జిల్లా వెంకటాపాలెం, ఉండవల్లి, రాయపూడిలోని ఇసుక రీచ్‌లకు వేలం నిర్వహించేందుకు జాయింట్ కలెక్టర్ జారీ చేసిన నోటిఫికేషన్‌పై హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. కొత్త ఇసుక పాలసీని అనుసరించి ఎపి మినరల్ రాయితీల నిబంధనలకు సవరణ చేయకుండా జాయింట్ కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని పలువురు దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఇసుక రీచ్‌ల వేలంపై స్టే విధించారు. అనంతరం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

వంద ఎకరాల్లో
జర్నలిస్టు కాలనీ

హైదరాబాద్‌లో నిర్మాణానికి సిఎం కెసిఆర్ హామీ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 29: గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్‌లో వంద ఎకరాల్లో జర్నలిస్టులకు ప్రత్యేకంగా కాలనీ నిర్మించనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. ఈ అంశంపై జర్నలిస్టు యూనియన్ నాయకులతో ముఖ్యమంత్రి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. రిపోర్టర్లు, కెమెరామెన్లు, డెస్క్ జర్నలిస్టులు అందరికీ గతంలో ఇచ్చిన హామీ మేరకు అపార్ట్‌మెంట్లు నిర్మించి ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. హౌసింగ్ సొసైటీలకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులు, వివాదాలతో సంబంధం లేకుండా పనిచేసే జర్నలిస్టులు అందరికీ ఫ్లాట్లను ఇవ్వనున్నట్టు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఎలాంటి వివాదం లేని స్థలాన్ని ఎంపిక చేయాలని సూచించారు. జర్నలిస్టు యూనియన్ నాయకులు, అధికారులు శనివారం స్థలాలను పరిశీలించి సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. శనివారం ఒక ప్రతినిధి బృందం వివిధ ప్రాంతాల్లో పర్యటించి అనుకూల అంశాలను ముఖ్యమంత్రికి వివరిస్తుంది.

రైల్వే ప్రాజెక్టులపై
టి-సిఎస్‌తో జిఎం చర్చలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 29: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలంగాణ ప్రాంతంలోని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పలు అంశాలపై రైల్వే జిఎం రవీంద్ర గుప్తా శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో సచివాలయంలో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం రైల్వే శాఖకు అందిస్తున్న సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎంఎంటిఎస్ రైలు రెండవ దశ, యాదాద్రి పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం రాయగిరి రైల్వే స్టేషన్ వరకు పొడిగించే అంశాలపై చర్చించారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉన్న మూడు ప్రధాన స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు నగర శివారులోని చర్లపల్లి, నాగులాపల్లి వద్ద నూతన రైల్ టెర్మినళ్ల నిర్మాణం, సరుకు రవాణా అవసరాలకు వీలుగా రెండు కొత్త టెర్మినళ్ల నిర్మాణం వంటి ప్రతిపాదనలపై జిఎం చర్చించినట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, విద్యుద్ధీకరణ వంటి అంశాలపైనా చర్చించారు.

మహమ్మద్ ప్రవక్త

ఊహాచిత్రం ప్రచురణ
పోలీసు అదుపులో ప్రచురణ సంస్థ నిర్వాహకుడు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 29: మహమ్మద్ ప్రవక్త ఊహాచిత్రం తదితర అంశాలపై ప్రచురించినందుకు ఒక పోటీ పరీక్షల ప్రచురణ సంస్ధ అధినేతపై దక్షిణ మండలం జోన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని డిసిపి వి సత్యనారాయణ తెలిపారు. మజ్లిస్ తహఫీజ్ ఖతామే నుబువాట్ ట్రస్టు తెలంగాణ, ఏపి కార్యదర్శి మహమ్మద్ అర్షద్ చేసిన ఫిర్యాదు మేరకు మీర్ చౌక్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ఈ నెల 23వ తేదీన నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేసిన తర్వాత పోలీసులు పోటీపరీక్షల మ్యాగజైన్ ప్రధాన సంపాదకుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

జగన్ అక్రమాస్తుల కేసులో
ఈడీ రెండో అభియోగపత్రం దాఖలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 29: జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) రెండో అభియోగపత్రం దాఖలు చేసింది. సిబిఐ చార్జిషీట్‌కు ఆధారంగా విచారణ జరిపినట్లు ఈడి తెలింది. జగన్ కంపెనీల్లో అరబిందో, హెటిరో సంస్థలు రూ.29.50 కోట్లు పెట్టుబడి పెట్టాయని, ఇందుకు గాను వైఎస్ ప్రభుత్వం 75 ఎకరాల భూమిని వీరికి కేటాయించినట్లు ఈడి పేర్కొంది.

సబ్ ఇంజనీర్ల రిక్రూట్‌మెంట్‌పై హైకోర్టు స్టే
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 29: తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెట్ నిర్వహించిన సబ్ ఇంజనీర్స్ రిక్రూట్‌మెంట్‌ను రాష్ట్ర హైకోర్టు నిలిపివేస్తూ శుక్రవారం స్టే విధించింది. జి అరవింద్‌కుమార్‌తో సహా పలువురు కాంట్రాక్టు డిప్లొమా ఆపరేటర్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్‌రావు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇన్ సర్వీసు ఉద్యోగులకు వెయిటేజి ఇవ్వాలని గతంలో కోర్టు ఇచ్చిన తీర్పునకు ఇది భిన్నంగా ఉందని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. దీంతో రిక్రూట్‌మెంట్ ప్రక్రియను మూడు వారాల పాటు నిలిపివేసిన హైకోర్టు, తదుపరి విచారణను ఫిబ్రవరి 16కు వాయిదా వేసింది.