తెలంగాణ

ఎసిబి వలలో అటవీ అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సాపూర్, నవంబర్ 27: మెదక్ జిల్లా నర్సాపూర్ రేంజ్ అధికారి మధుసూదన్‌రావు పది వేల లంచం తీసుకుంటూ శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు. ఎసిబి నిజామాబాద్ డిఎస్‌పి సూర్యనారాయణ కథనం ప్రకారం... వికారాబాద్‌కు చెందిన వైద్యనాథ్ సదాశివపేటలో సామిల్ ఏర్పాటుకు రెండు నెలల క్రితం మెదక్ డిఎఫ్‌ఓ కార్యాలయంలో దరఖాస్త్తు చేసుకొన్నాడు. ఆమేరకు సామిల్ ఏర్పాటు స్థలం పరిశీలించాలంటూ నర్సాపూర్ రేంజి అధికారికి ఆ ఫైల్‌ను పంపారు. దాంతో వైద్యనాథ్ నర్సాపూర్ రేంజి అధికారి మధుసూదన్‌రావును కలిసి పని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. కాగా, పని పూర్తి చేయడానికి గాను రూ. 40 వేలు ఇవ్వాలని సూచించారు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని వైద్యనాథ్ ఎసిబి అధికారులను సంప్రదించాడు. ఈమేరకు శుక్రవారం తన సిబ్బందితో వచ్చి పది వేల రూపాయల లంచం తీసుకుంటున్న ఎఫ్‌ఆర్‌ఓ మధుసూదన్‌రావును వలపన్ని పట్టుకొన్నట్లు తెలిపారు. ఈ అపరేషన్‌లో ఎసిబి సిఐలు నవీన్‌కుమార్, ప్రతాప్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
40వేల లంచం అడిగారు: బాధితుడు
సదాశివపేటలో సామిల్ ఏర్పాటు చేసేందుకు ఖర్చుల కింద 40వేల రూపాయలు ఇవ్వాలని నర్సాపూర్ ఎఫ్‌ఆర్‌ఓ డిమాండ్ చేసినట్లు బాధితుడు వైద్యనాథ్ తెలిపారు. నర్సాపూర్ ఫారెస్టు కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంటు భిక్షపతిగౌడ్ సైతం మెదక్ నుంచి ఫైల్ తీసుకురావడానికి రెండు వేలు తీసుకున్నాడని ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రెండు నెలలుగా ఈ అవస్థలు భరించలేక ఎసిబి అధికారులను సంప్రదించానని వైద్యనాథ్ పేర్కొన్నాడు.